అడిషినల్ ఎస్పి పి. వి మురళీధర్ బదిలీ… ఘనంగా వీడ్కోలు

జగిత్యాల జిల్లా : మార్చి15, sircilla srinivas, 9849162111

IMG-20190315-WA0494

పదోన్నతిలో భాగంగా పి. వి మురళీధర్ అడిషినల్ ఎస్పిగా జగిత్యాల జిల్లాకు వచ్చి బాద్యతలు విజయవంతంగా నిర్వహించి, ఇటివలే పోలీస్ ట్రైనింగ్ సెంటర్,వరంగల్ కు బదిలీ కావడం జరిగింది.

శుక్రవారం మురళీధర్ అడిషినల్ ఎస్పి బాద్యతలను జిల్లా ఎస్పి కి అప్పగించి తాను బదిలి అయిన పోలీస్ ట్రైనింగ్ సెంటర్,వరంగల్ కు వెళుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి, మురళీధర్ ను జిల్లా పోలీస్ లు సన్మానించి ఆత్మీయ వీడుకోలు పలికారు.,

ఈ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ గడిచిన నాలుగు నెలల్లో జరిగిన ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహించారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు నల్లా మల్లారెడ్డి, వెంకటరమణ, సీతారాములు, ఎఆర్ డిఎస్పీ ప్రతాప్, సి.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు SI లు, ఇతర పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.