అనారోగ్యంతో బాధ పడుతున్న పాపకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం

jagtial, april 22, telanganareporter, 9849162111


ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధ పడుతున్న పాపకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.
IMG-20190422-WA0323
కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, రంగశాయిపల్లె గ్రామానికి చెందిన పోతు
 రాజశేఖర్ కూతురు రిషిత ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు తీసుకపోతే… డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ చెయ్యాలి, ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పడంతో పాప తండ్రి రాజశేఖర్ నిర్ఘాంత పోయి నైరాశ్యం చెందాడు.. కూలినాలి చేసుకుని కుటుంబాన్ని పోషించే తన దగ్గర అంత డబ్బు లేదని, తెలిసినవాళ్లు దగ్గర వాపోయాడు. అన్ని స్వచ్చందసంస్థలకు ఈ విషయం తెలియజేశారు,  ఆర్ధిక సహాయం కోసం రంగసాయిపల్లె గ్రామస్థుడైన  దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి మీడియా కోఆర్డినేట్ చిలుముల రమేష్ కు ఈ విషయం చెప్పడం జరిగింది, వెంటనే సేవాసమితి దృష్టికి ఈ విషయం తీసుకురాగా, సభ్యు  లందరితో చర్చించి,  సోమవారం జగిత్యాల అరుణ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పాప తండ్రి పోతు రాజశేఖర్ కు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకుడు నర్సింహునిపేట సర్పంచ్ నెరువట్ల  బాబుస్వామి,సరికొండ నరేష్, రొట్టె మల్లేష్, బొడ్డు లింగన్న,
సుధాకర్ , వినిత్ పాల్గొన్నారు