అనుదీప్  ఐఏఎస్, తెలంగాణ క్యాడర్ కు కేటాయింపు

Hyderabad,may11, 2019, telanganareporter
anudeep
2017 లో అఖిలభారత సర్వీసులకు ఎన్నికైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వివిధ రాష్ట్రాల కేడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ నుండి ఉతీర్ణత సాధించిన మొదటి రాంకర్ అనుదీప్ కు మరియు 6వ రాంకర్ కోయ శ్రీహర్ష లకు తెలంగాణా క్యాడర్ ఐఏఎస్ అధికారులుగా పరిగణింప బడుతారు.
ప్రస్తుతం వీరిద్దరూ ముసోరి లో శిక్షణ లో ఉన్నారు.
అనుదీప్ ను ఈ విషయం పై సంప్రదించగా… తన స్వంత రాష్ట్రం కు కేటాయింపు రావడం అదృష్టం గా భావిస్తున్నానని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కలగటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అనుదీప్ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు.