అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ధర్మపురి హరిత హోటల్ ?…

ధర్మపురి మే 14
తెలంగాణా రిపోర్టర్ : మధు మహదేవ్

IMG-20180514-WA0588

పట్టించుకోని అధికారులు…

హరిత లో (రూం) మద్యం బాటిళ్లు
హరిత లో (రూం) మద్యం బాటిళ్లు
నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి
(She Team SI  అని చెప్పిన..    నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి)
(హరితరిసెప్షన్ కౌంటర్ లో దొరికిన ఐడి కార్డులు)
(హరితరిసెప్షన్ కౌంటర్ లో దొరికిన ఐడి కార్డులు)

షీటీం ఎస్ఐ ని అని చెప్పి హోటల్లో మకాం వేసిన వరంగల్ వాసులు ..

హరిత హోటల్ లో విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాలు ..

గతంలోనూ సహకరించిన అప్పటి మేనేజర్….ఇప్పుడు సిబ్బంది..

సిసి కెమెరాలు లేకపోవటం తో … తలలు పట్టుకుంటున్న పోలీస్ యంత్రాంగం ….

ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ధర్మపురిని కొందరు వ్యక్తులు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారని చెప్పక తప్పడంలేదు..

పుష్కరాల సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ ని ప్రారంభించారు.

కొంత కాలం సక్రమంగా నడిచిన ఈ హోటల్ గత కొన్ని నెలలుగా అందరి నోళ్ళలో నానుతోంది.

ఈ హోటల్ లో అప్పటి మేనేజరే తమ శాఖ పరువు తీసేలా …పుణ్యక్షేత్రం పేరు పోయేలా…వ్యవహరించడమే ఇందుకు కారణమైందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ తతంగాలకు కొందరు స్థానికులు సైతం అతనికి చేయూతనివ్వటంతోనే హరిత హోటల్ పేరు, టూరిజం శాఖ పేరు అప్రతిష్ట పాలయ్యేలా పరిస్థితి తయారైందని చర్చించుకుంటున్నారు.

అసాంఘీక కార్యకలాపాలు విశృంఖలంగా మారడంతో పాటు… ఇటు శృంగార కార్యకలాపాలకే కాకుండా, చట్ట వ్యతిరేక శక్తులకు కుడా ఈ హరిత హోటల్ అడ్డగా మారిందని పలువురు వాపోతున్నారు. సోమవారం జరిగిన సంఘటనను పరిశీలిస్తే…పట్టణ వాసుల ఆవేదన వాస్తవమేనని అనక తప్పదు కూడా…

వివరాల్లోకి వెళితే….
ఈ నెల 9 వతేదిన వరంగల్ జిల్లా ఐలోని గ్రామానికి చెందిన విజయగిరి శివకుమార్ , విజయగిరి అనిల్ కుమార్ ,కాశిబుగ్గ కు చెందిన గనిపాక భాను ఈ హోటల్ లో రూమ్ తీసుకున్నారు.

ఐతే విజయగిరి శివకుమార్ తను షీటీం ఎస్ఐ ని అని చెప్పి కొందరు స్థానికులతో పరిచయాలు పెంచుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ….దానికి కొంత ఖర్చు అవుతుందని వారిని నమ్మించాడు..

ధర్మపురి కి చెందిన ఒక కారు ను అద్దెకు తీసుకొని పలు గ్రామాలు కుడా తిరిగినట్టు సమాచారం.

తాజా గా ఒక పెళ్లి కి కుడా వెళ్లి అక్కడి వారితో ధర్మపురి నియోజకవర్గం లోని ధర్మారం పోలీస్ స్టేషన్ కు తను ఎస్ఐ గా పోస్టింగ్ తీసుకోబోతున్నట్టు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.

అంతేగాక, మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని… హరిత హోటల్ దగ్గర స్థానికులను నమ్మిoచడం కోసం కేకును కట్ చేసి సంబరాలు కుడా చేసారు.

అనుమానం వచ్చిన కొందరు యువకులు ధర్మపురి పోలీసులకు సమాచారం అందించగా… ఆదివారం రాత్రి హరిత హోటల్ ను తనిఖీ చేసారు.

పోలీసుల సమాచారం తెలుసుకున్న శివకుమార్ ఫరారై, తన ఫోన్ ను స్విచాఫ్ చేసారు.

కాగా, శివకుమార్ తో వచ్చిన వారిని పోలీస్ లు విచారించగా… అనిల్ అనే వ్యక్తి శివకుమార్ కు సొంత ఆన్నయ అని చెబుతున్నారు.

భాను అనే మరో యువకుడికి ధర్మపురిలో ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొని వచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

శివకుమార్ ఫై ఇదివరలో కుడా కాజీపేట పోలీసు స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదుఅయ్యినట్టు… అప్పటినుండి ఇతరప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అనిల్ తెలిపారు.

పోలీసులు శివకుమార్ కోసం గాలిస్తున్నారు…
*హరిత హోటల్ లో విచ్చాలవిడిగా శృంగార కార్యకలాపాలు ..*
ఇది ఇలా ఉండగా హరిత హోటల్ కామకలాపాలకు అడ్డగా మారింది.

ధర్మపురి హరిత హోటల్ లో మద్యం, మాంసం నిషేధం…

కానీ, గత మేనేజెర్ వ్యవహార శైలితో …ఇక్కడ అన్నిరకాల కార్యకలాపాలు నడుస్తునాయి.

గతం లో పోలీస్ లు రైడింగ్ చేసినప్పుడు ప్రతీ గదిలో పేకముక్కలు మద్యం బాటిళ్ళు దర్శనమిచ్చాయి.

ప్రస్తుతం మేనేజర్ లేని నేపథ్యంలో …ఇంచార్జి గా ఉన్న ఓ ఉద్యోగి అన్నీ తానై అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపినట్లు తెలుస్తుంది.

ఈ నెల 12 న భార్యాభర్తలమని చెప్పి హోటల్ గదిలో దిగిన ఓ జంట, 14 న ఉదయం 8 గంటల వరకు బయటకు రాకుండా గదిలో ఉండి పోవడాన్ని అనుమానించిన కొందరు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది..దీంతో రంగం లోకి దిగిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.

ఆ జంట వివరాలు రిజిస్టర్ లో పరిశీలించగా రూమ్ నెంబర్ 203 గా , L. కిషన్ గుండి గోపాల్రావుపేట, జగిత్యాల జిల్లాగా నమోదైంది.

కానీ, నిజానికి ఈ తప్పుడు గుర్తింపు కార్డుతో వారున్న రూమ్ మాత్రం 205.

వారిని విచారించగా సిద్ధిపేట, హైదరాబాద్ లో కోళ్ళఫారం నడిపే వ్యాపారం ఉన్న కరీంనగర్ జిల్లా, బ్యాంకు కాలనీ కి చెందిన వ్యక్తి గా(30), మరియు కరీంనగర్ లోని బస్ స్టాండ్ కు వెళ్లే దారిలోని ఒక కాలనీకి చెందిన ఒక మహిళగా(28) గుర్తించారు.

వీరు వారికి సంబంధించిన గుర్తింపు కార్డులతో కాకుండా, దొంగ ఐడీ లతో రూమ్ తీసుకున్నట్లు స్పష్టమౌతుంది…

అలాగే సదరు మహిళ అతని భార్య కాకపోగా ఆమెకి అంతకుముందు పెళ్లై బాబు పుట్టాక భర్తకు దూరంగా ఉంటోందని …ఈ క్రమంలో వీరు తరచూ ఇక్కడి హరిత హోటల్ కి వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంటారనీ , అతనికి ఈ మద్య వివాహం నిశ్చయం ఐనట్లు వీరికి సిబ్బందే పూర్తిగా సహకరిస్తున్నారనీ తెలుస్తున్నది.

అంతే కాకుండా నిషేధం ఉన్న మద్యం, మాంసాలు వీరికి ఎలా వచ్చాయి అన్న కోణం లో పోలీస్ లు విచారణ చేపట్టారు.

నిజానికి ఈ జంట 12 న రాత్రి 10 గంటలకు గదికి చేరగా రిజిస్టర్ లో మధ్యాహ్నం11 లకు వచ్చినట్టు పేర్కొనడం పైగా వారినుండి ఎలాంటి గుర్తింపు రుజువులు అడుగకపోవడం పలు అనుమానాలను తావిస్తోంది.

రిసెప్షన్ కౌంటర్ లో నకిలీ ఆధార్ కార్డులు లభ్యం కావడం, సిబ్బందే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడౌతుంది..

కాగా..హోటల్ లో సిసి కెమెరాలు లేకపోవటం తో …తలలు పట్టుకుంటున్న పోలీస్ యంత్రాంగం హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో… సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ, సంబంధిత శాఖ, హోటల్ సిబ్బంది ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ నిర్వహణలోని హోటల్ లో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుడటంతో నేరస్తులను పట్టుకోవటం లో పోలీస్ యత్రాంగం తలలు పట్టుకోవాల్సిన పరిస్తితి నెలకొంది.

కాగా సోమవారం హరిత లో పట్టుబడ్డ జంటతో పాటు సహకరించిన సిబ్బందిని ,
షీ టీం ఎస్ఐ అని చెప్పి పలువురీ మోసం చేస్తున్న శివకుమార్ కేసు తో సహా
హరితా హోటల్ ఉదంతాన్ని పోలీస్ యంత్రాగం సీరియస్ గా తీసుకుంటునట్లు, తమదైన శైలిలో విచారిస్తున్నట్లు
పోలీస్ వర్గాలు తెలిపాయి.

ఏది ఎలా ఉన్నప్పటికీ, పుణ్యక్షేత్రాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం మూలాన ఈ క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలాగా ఉందని …
ఇలాoటి వాటి ఫై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మపురి పట్టణ ప్రజలు కోరుతున్నారు .