ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలను అరికట్టాలని రామగుండం సిపి ని కోరిన ఎఐవైఎఫ్ శ్రేణులు..

 

IMG_20180930_114851www.telaganareporter.news✍9394328296..

కోల్ బెల్ట్ లో ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలను అరికట్టాలని రామగుండం సిపి ని కోరిన ఎఐవైఎఫ్ శ్రేణులు..

👉చట్టవ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా, వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయి. ప్రజల కోసం పోలీసులు ఉన్నారు.. రామగుండం సిపి వి.సత్యనారాయణ..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, సెప్టెంబర్-30, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-

కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో ఆన్ లైన్ తో బెట్టింగ్, సైబర్ నేరలతో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ను అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్ ) నేతలు కోరారు..
ఈ మేరకు రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సిపి ని కలిసి ఆన్ లైన్ బెట్టింగ్,తదితర మోసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు… ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో నిరుద్యోగులను, యువతను, నిరక్షరాస్యులను, రిటైర్డ్ కార్మికులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ఆసరాగా చేసుకొని వారిని భాగస్వామ్యం చేస్తూ కొంతమంది ఆన్ లైన్ పేరుతో వేరే రాష్ట్రాలకు చెందిన బెట్టింగ్ తో పాటు తదితర సైబర్ నేరాలతో అసాంఘిక కార్యకలాపాలతో కోట్లాది రూ”ల వ్యాపారాలు చేస్తున్నారని, ఈ జోరు దందాలో పెట్టుబడి పెట్టిస్తూ వాటికి రెండింతలు, నాల్గింతలంటూ, ఇంకా పలువురిని ఆకర్షించే విధంగా బహుమతులు(విదేశీ పర్యటనలు) ఉంటాయని నమ్మిస్తూ, మోసం చేస్తూ వారి బ్యాంకు అకౌంట్ లో లక్షలాది, కోట్లాది రూ”లు ఉన్నట్లు, వాటిని సైతం సీజ్ చేస్తున్నట్లు వివిధ పత్రికలు ప్రచురితమైనాయని తెలుపారన్నారు.. అలాగే ఈ ప్రాంతంలో అనుమతులు లేని చిట్ పండ్లు, ఫైనాన్స్, తదితర వడ్డీ వ్యాపార సేవలు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారని తెలిపారు..
ఇలాంటి మోసాలకు జరుగుతున్న ఈ ప్రాంతంలో ప్రజల రక్షణ లో పోలీసులు ఉన్నారనే ధీమా కల్పించాలని, అనుమతి లేని వ్యాపారాలు చేస్తున్న వారిపై తగిన విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎఐ వైఎఫ్ ఆధ్వర్యంలో సిపి కి విజ్ఞప్తి చేశారు..
ఈ మేరకు రామగుండం సిపి సత్యనారాయణ సానుకూలంగా స్పందించినట్లు, చట్టవ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా, వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని, ప్రజల కోసం పోలీసులు ఉన్నారని తెలియజేసారన్నారు..
ఈ కార్యక్రమంలో సీపీఐ, దాని అనుబంధ సంఘం ఎఐ వై ఎఫ్ శ్రేణులు టి.రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, ఈర్ల రామచంద్రం, జనగామ మల్లేష్ పాల్గోన్నారు..