ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ రామారావు, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తాత్కాలికంగా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు

మెగాస్టార్ చిరంజీవి వస్తున్న విషయం తెలియగానే రాజమౌళి పరుగుపరుగున వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుని ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ అంటే ఇదే ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుస్తున్నారు. దీని అర్థం రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అని…. త్వరలోనే ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించనున్నారు.