ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ ఆధ్వర్యంలో “యువగ్యాని టెస్ట్”…8 న

జగిత్యాల, ఏప్రిల్ 7: sircilla srinivas..9849162111, telanganareporter. News


ప్రస్తుత కాలంలో సివిల్ సర్వీసెస్ పరిధి ఎంతో విసృతం అయ్యింది. ఎంతోమంది విద్యార్ధులు ఐఏఎస్ కావాలి అని కలలు కంటున్నారు.

IMG-20190407-WA0870

ఈ కలని సాకారం చేసుకోవడానికి చాలామంది విద్యార్ధులు నిత్యం కృషి చేస్తున్నారు.

IMG-20190407-WA0869

అందుకే ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని 22 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా “యువగ్యాని టెస్ట్” ని నిర్వహిస్తున్నారు.

ఈ టెస్ట్ ని విద్యార్ధులు ఎక్కడ నుంచి అయినా ఆన్లైన్ ద్వారా రాయవచ్చు. అలానే ఈ 22 జిల్లాల్లో ఆఫ్‍లైన్ టెస్ట్ కూడా విద్యార్థులు రాయడానికి ఎంచుకోవచ్చు.

ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని 22 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా “యువగ్యాని టెస్ట్” ని నిర్వహిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ శరత్ ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ..జగిత్యాల జిల్లా కలెక్టర్ డా. ఏ. శరత్ మాట్లాడుతూ… “ఈ దేశానికి సివిల్ సర్వెంట్స్ అవసరం ఎంతో ఉంది అని, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్ లేనందు వల్ల ఈ టెస్ట్ ఎంతో మంది పిల్లలకి ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ టాలెంట్ టెస్ట్ లో మొదట వచ్చిన ముగ్గురికి ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ పూర్తిగా ఐదు సంవత్సరాల కోచింగ్ ఉచితంగా ఇస్తుంది. ఈ నెల 8వ తేది జగిత్యాల వాసవి గార్డెన్స్ లో ఉదయం 10 – 1 వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము అని యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధులు తెలియచేశారు. ఉచితంగా మీ పేరు నమోదు చేసుకోవడానికి www.yuvagyani.com సంప్రదించండి లేదా ఈ నెంబర్లకి ఫోన్ చేయండి:  9000014827