ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు రక్షణ చర్యలు తీసుకోవాలి : జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా

 రాజన్న  సిరిసిల్ల ,14 మార్చి 2019: టి రిపోర్టర్ (సంపత్ పంజ):-


IMG-20190314-WA0543

వలస కార్మికుల పిల్లలకు విద్య, వైద్యం తదితర అంశాల్లో పూర్తి స్థాయిల్లో రక్షణ కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా కార్మిక శాఖ అధికారులకు సూచించారు.

IMG-20190314-WA0544

గురువారం సిరిసిల్ల కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఇటుక బట్టీల కార్మికుల ప్రతినిధులు, యజమానులు , సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కార్మికులు , వారి పిల్లల సంక్షేమం పై జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా సమావేశం సమావేశం నిర్వహించారు.

 సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని ఇటుక బట్టీల కూలీలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడితే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ హెచ్చరించారు.

కూలీలు పని చేయకుంటే వారి రాష్ట్రాన్ని పంపాలిగానీ దాడులు చేయవద్దని అన్నారు. మానవతా దృక్పథంతో వారిని సాటి మనుషుల్లా చూడాలని సూచించారు. ఇటుక బట్టీల వద్ద కూలీలకు వెలుతురు, గాలి వచ్చేలా పెద్ద సైజులో గదులు నిర్మించాలని అన్నారు. ఇండ్ల వద్ద విద్యుత్‌, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.

ఆడవారికి, మగవారికి వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించాలని ఆదేశించారు. కూలీలందరికీ బ్యాంక్‌ ఖాతాలు తెరిపించి జీతాలు వారి ఖాతాల్లోనే వేయాలని ఆదేశించారు.

ఇటుక బట్టీలకు కార్మిక శాఖ ద్వారా లైసెన్సులు పొందాలని సూచించారు. ప్రతి కూలీకి ఆధార్‌కార్డు ఉండాలని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కూలీల చిరునామా, వయస్సు కులం, తల్లిదండ్రుల పేర్లు, పిల్లల సంఖ్య వారి వయస్సుచ ఆరు నెలల గర్భిణుల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి కార్మిక, పోలీసు శాఖ అధికారులకు అందజేయాలని ఆదేశించారు. కూలీలందిరికీ డబ్బులు చెల్లించి కార్మికశాఖ ద్వారా బీమాకార్డులు పొందాలని సూచించారు. రోజుకు ఎనిమిది గంటలకు మించి కూలీలతో పనులు చేయించారదని ఆదేశించారు.

ఆడ కూలీలతో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉదయం ఏడు గంటలకు ముందు పనులు చేయించరాదని ఆదేశించారు. పనులు జరిగే ప్రదేశంలో నెల వారిగా పనులు జరిగే పని వేళలను బట్టీల వద్ద ప్రదర్శించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ ఆదేశించారు.

ఇటుక బట్టీల యజమానులు కూలీల హజరు పట్టిక, మస్టర్‌ రోల్‌, పని వేళలు, బ్యాంక్‌ ఖాతాల రిజిష్టరు మొదలటు రిజిష్టర్లు నిర్వహించాలని ఆదేశించారు. 18సంవత్సరాల లోపు పిల్లలందరు పనిలో పెట్టుకోకూడదని తెలిపారు. కూలీలందరికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ద్వారా ఇటుక బట్టీల వద్ద గల పిల్లలకు విద్యనందించాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. ఆరు సంవత్సరాలోపు పిల్లలను అంగన్‌వాడీలలో చేర్పించాలని చిన్న పిల్లలకు, గర్భిణీలకు సౌ పౌష్టికాహరం అందించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. బట్టీల వద్ద తరచుగా వైద్య శిబిరాలు నిర్వహించి కూలీలందరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు.

చిన్న పిల్లల ఆట వస్తువులు అందించాలని యజమానులను ఆదేశించారు. పిల్లలు ఎక్కువ ఉన్న బట్టీల ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలని అన్నారు. . వేసవి దృష్ట్యా ఎండ దెబ్బ తగలకుండా తగలకుండా చూసేందుకు ఇటుకబట్టిల యజమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు .

సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి చక్రాధర్ రెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి  డి రాధాకిషన్ , డి డబ్ల్యు ఓ సరస్వతి ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ..