ఇవాంకాకు ప్రధాని ప్రత్యేక కానుక!!!…

ఇవాంకాకు ప్రధాని ప్రత్యేక కానుక

విశిష్ట అతిథికి విశిష్ట కానుకే అందింది. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకాకు ప్రధాని మోదీ ప్రత్యేక బహమతిని అందజేశారు. గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునరావృత నమూనాలతో కూడిన మెక్రో మోజాయక్‌ బాక్స్‌ను ఆమెకు ఇచ్చారు. విశేష నైపుణ్యంతో తయారు చేసిన ఈ బాక్స్‌ను ప్రధాని ప్రత్యేకంగా సూరత్‌ నుంచి తెప్పించినట్టు సమాచారం