ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 40 ట్రాక్టర్ లను పట్టుకొన్న టాస్క్ ఫోర్సు పోలీసులు

www.telaganareporter.news.✍9394328296

ఇసుక అక్రమ రవాణా పై రామగుండము కమీషనరేట్ పోలీస్ స్పెషల్ డ్రైవ్

IMG-20190607-WA0025

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 40 ట్రాక్టర్ లను పట్టుకొన్న టాస్క్ ఫోర్సు పోలీసులు*……..

*తదుపరి చర్య నిమిత్తం రెవెన్యూశాఖకు అప్పగింత, ఇసుక అక్రమ రవాణా పునరావృతం అయితే చట్టరీత్య కఠిన చర్యలు*

రామగుండం కమిషనరేట్, జూన్-7,తెలంగాణా రిపోర్టర్( దినేష్) :

రామగుండము కమీషనరేట్ పరిదిలో కొంత మంది వ్యక్తులు ఇసుక అక్రమ రవాణా చట్ట విరుద్ధంగా చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రామగుండము పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ గారు రెండు జిల్లాలలో 12 టీమ్స్ లను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.ఈ డ్రైవ్ మంచిర్యాలజిల్లాలో సింగపూర్ (శ్రీరాంపూర్ మండల్),సిసిసి నస్పూర్ ,ముల్కల,హాజీపూర్,తాళ్ళగురిజాల ,కన్నేపల్లి,పెద్దపల్లి జిల్లాలో….సుల్తానాబాద్,కాల్వ శ్రీరాంపూర్ ,సుందిళ్ళ ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా (40) ట్రాక్టర్ల ను పట్టుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వివరాలను వెల్లడించారు..

పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుకొన్న ట్రాక్టర్లు మరియు ఓనర్స్/డ్రైవర్స్ వివరములు :
*కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో*….
TS 19 A 7665 …బోగే రాజాం s/o పోసం ,తాండూర్
AP 15 L 8021 …గోల చంద్రయ్య s/o బాపు ,తాండూర్
TS 07 UC4397…. అతిమల మహేష్ s/o బక్కయ్య ,సంద్రవల్లి
TS 19 T 3592 …బాగారపు శివశంకర్ వరప్రసాద్ s/o లచ్చయ్య ,పెద్ద భూదా
TS 20 T 0307 ….ఆలం శ్రీను s/o పోషం ,దాంపూర్
AP 01 Y 2413…. అర్కం శ్రీను s/o బాపు ,దాంపూర్
TR పవర్ TRACTOR ….దర్శి రమేష్ s/o పాపయ్య .దాంపూర్
TR SONALIKA TRACTOR……అర్కం రమేష్ s/o చంద్రయ్య ,దాంపూర్
TS 19 T 0513 ……బోకి రాజేష్ s/o బీరయ్య, టేకులపల్లి
TS 19 T 5424 …అట్లా సాయితేజ s/o నరేష్ ,టేకులపల్లి
TS 01 Y 62 15 …అట్లా రమేష్ s/o భూమయ్య ,టేకులపల్లి.

IMG-20190607-WA0023

*తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిదిలో*….
TS 19 T 2898…తాండ్ర రామకృష్ణ s/o నర్సయ్య ,బెల్లంపల్లి
TS 19 T 2928 …కందుల రాజబాబు s/o శంకరయ్య ,పెర్కపల్లి
TS 19 T 0607 …ఎస్ కే బాసు s/o రాజ్ మహమ్మద్ ,బెల్లంపల్లి

*శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో*….
TS 19 T 3753 ….సల్లూరి బానేష్ s/o రాయలింగు,సింగపూర్
TS 19 T 56 28 ….సల్లూరి బానేష్ s/o రాయలింగు,సింగపూర్
TS 19 T 5706 ….ముప్పు కిరణ్ s/o శంకర్ సింగపూర్
TS 19 T 2708….కుర్రె చక్రవర్తి s/o దుర్గ ప్రసాద్ ,సింగపూర్
TS 19 T 5615…దుర్గం రాజ బాబు s/o లింగయ్య ,సింగపూర్
TS 19 T 7445…. కొంతం ప్రశాంత్ s/o చంద్రయ్య ,సింగపూర్
TS 19 T 3428…కామెర స్వామి @ చంద్రయ్య s/o లక్ష్మయ్య ,సింగపూర్
TS 19 T 3508…గజేల్లి రాజయ్య s/o బొందయ్య ,సింగపూర్
TS 19 T 1356….నామాల రమేష్ s/o మల్లయ్య ,సింగపూర్
TS 19 T 5041…సిరిపూరం రవి s/o రాజం ,సింగపూర్

*సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో*…..
TS 19 T 6047….రంగా రాజశేకర్ s/o రాజయ్య ,నస్పూర్ గేటు
AP 01 Y 6539…శ్రీపతి శంకర్ s/o రాజారాం,నస్పూర్
AP 23 AH 2479. ..బట్టని రాములు s/o భూమయ్య ,నస్పూర్
AP01 W 7952 ….మెండే కుమార్ ,నస్పూర్
TS 19 T 4692…గడ్డం సత్య గౌడ్ ,నస్పూర్
TS 01 VB 3328….గడ్డం సత్య గౌడ్, నస్పూర్
TS 19 T 3473 …బాచల శంకర్ s/o సాలయ్య,నస్పూర్

*హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో*..….
AP01 Y 3219…వల్లాపు రవి s/o ఎల్లయ్య ,ఒడ్డెర గూడెం ,మంచిర్యాల
TS 02 UB 3008…చిందం సత్యనారాయణ s/o గురువయ్య,ఎల్.ఐ .సి కాలనీ మంచిర్యాల
TS 01 UB 1422…అంకం.శ్రీనివాస్ హాజీపూర్

*కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో*….
TS 22 T 1976….నాగేశ్వర్ రావు s/o ఒలాల రావు,
AP 05 OG 4445…..
TS 22 B 6396…..తీగల నరేష్ s/o వెంకటేష్ ,
TR…..బంధారపు శ్రీకాంత్ s/o రాములు,కూనారం

*గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో*…
TS 02 EQ 6072 ముస్కల నరేందర్ రెడ్డి s/o రంగారెడ్డి,సుందిళ్ళ
*సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలో (1) ట్రాక్టర్*

*అవసరాలే ….ఆసరాగా*:
ప్రస్తుతం వేసవికాలం కావడం ఎక్కువ మంది ఇండ్లు నిర్మించడం ఇసుక లబించడం కష్టం అవుతున్న క్రమమలో ఇదేఅదునుగా భావించి ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు కి 2500 రూ నుండి ౩౦౦0 రూ,లకు విక్రయిస్తూన్నారు. ఇసుక అక్రమార్కులు విపరీతంగా రెట్లు పెంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.కొందరు గోదావరిలో నీళ్ళు ఉన్న సమయంలో వాగుల నుండి ,గోదావరినుండి ఇసుక తోడేస్తున్నారు.ప్రాంతాలు,అవసరాలు బట్టి రెట్లు నిర్ణయిoచి అనుమతి లేకున ఇసుక రవాణా చేస్తున్నారు .

*రాత్రి,పగలు నిరంతరంగా ఇసుక అక్రమ రవాణా*:
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు అక్రమంగా , సులభంగా సంపాధించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవ్యతిరేకంగా అక్రమార్కులు రాత్రి,పగలు అని లేకుండా ఇసుక అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు.అతి వేగం తో వాహనాలను నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తూ రాత్రంత్రా రవాణా చేస్తున్నారు .ప్రస్తుతం వేసవికాలం కావడం ఎక్కువ మంది ఇండ్లు నిర్మించడం వలన ఇదేఅదునుగా భావించి ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు కి 2500 రూ నుండి ౩౦౦0 రూ,లకు విక్రయిస్తూన్నారు. ఇసుక అక్రమార్కులు విపరీతంగా రెట్లు పెంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి ట్రాక్టర్లు పట్టుకున్న వారిలో మార్పురావడం లేదు.

*జరిమానాలు విధించినా ,చర్యలు తీసుకున్నా మార్పురాని వైనం*:
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నా వారి పద్దతిలో మార్పులు రావడంలేదు .ఇంటి నిర్మాణంలకి ,ప్రభుత్వానికి సంబందించిన నిర్మాణాల కోసమని చెబుతూ ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది.ఎంత మొత్తంలో ఇసుక అవసరం,ఈ వాహనాలు వినియోగిస్తున్నారణే వివరములు తప్పని సరి తెలుపాలి కానీ ఇలాంటివి ఏమి లేకుండా చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.
ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్ళడానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రూ.461 రుసుము చెల్లించాల్సి ఉంటుంది కాని ఎలాంటి రుసుము కట్టకుండా వాగులు ,నదులు ఒర్రెలు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు .దీంతో ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను లక్షలలో ఆదాయానికి గండి పడుతుంది.

*నదుల ఆరోగ్య సమతుల్యతకు ఇసుక అవసరం …& అడుగంటుతున్నా భూగర్బ జలాలు* :
అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు ఇసుక తోడేయడం వలన భూగర్బ జలాల నిల్వ తగ్గి పోవడం జరుగుతుంది.భూగర్బ జలాల నిల్వ తగ్గి భవిష్యత్తులో త్రాగడానికి నీరు దొరకడం కష్టం అవుతున్నది అన్నారు. నదుల్లో ఇనుకను విపరీతంగా తవ్వకం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. నదుల సమీపంలో ఉన్న భూమి క్రమక్షయానికిలోనై వరదలకు కారణం అవుతున్నది. నదుల సహజ స్వరూపాలు మారి, ప్రవాహ వేగంలో తేడాలు ఏర్పడుతున్నాయి. భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. నీటి ఎద్దడి కలుగుతున్నది. జంతుజాలం, వృక్షజాలం వృద్ది జరగడం లేదు. నదుల పర్యావరణ వ్యవస్థలోని ప్రధాన అంతర్భాగమే ఇసుక. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి సమతుల ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుందో, అదే రీతిలో నదుల ఆరోగ్య సమతుల్యతను కాపాడడంలో ఇసుక కీలకపాత్ర పోషిస్తుంది. వరదలు రాకుండా కాపాడుతుంది. భూగర్భజల మట్టాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నీటిలో పోషకాలు నింపడంలో ఎంతగానో దోహదపడుతుంది. మనుషులు, జంతు జాతులు వృద్ధి జరిగే ప్రక్రియలో ముఖ్యమైన పాత్రవహిస్తుంది.
సహజ వనరులను మితిమీరి వినియోగించడం జీవవైవిధ్య నాశనానికి దారితీస్తుందన్నదివాతావరణంలో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. ఫలితంగా మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇసుక వంటి సహజ వనరులను ఒడుపుగా, పొదుపుగా వినియోగించకపోతే మేలు కంటే కీడు ఎక్కువగా జరిగే ప్రమాదం పొంచి ఉంది అన్నారు .సహజ వనరులను మితిమీరి వినియోగించడం జీవవైవిధ్య నాశనానికి దారితీస్తుందన్నది ఇప్పటికే రుజువైంది. దానివల్ల పర్యావరణ వ్యవస్థలూ ప్రమాదంలో పడతాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. ఫలితంగా మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుంది.IMG-20190607-WA0024

*ఇసుక అక్రమ రవాణా చేసే వారికీ మరియు సహకరించే వారికి హెచ్చరిక* :
రామగుండము కమీషనరేట్ పరిదిలో కొంత మంది వ్యక్తులు ఇసుక అక్రమ రవాణా చట్ట విరుద్ధంగా చేస్తున్నారనే ఫిర్యాదులు రావడం,వార్త పత్రికలలో ప్రచురించడం జరుగుతుంది.ఇప్పటి నుండి రామగుండము కమీషనరేట్ పరిదిలోని రెండు జిల్లాలలో ఇసుక అక్రమ రవాణా చేయడం మానుకోవాలని లేని పక్షంలో ఎంతటివారైన ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు..