ఈవిఎం ల తరలింపు అంశంపై అనవసర రాధ్దాంతం : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.శరత్

జగిత్యాల జిల్లా: ఏప్రిల్ 16: sircilla srinivas, 9849162111, telanganareporter. News


జగిత్యాల లో ఈవిఎం ల తరలింపు అంశంపై మీడియా, రాజకీయ నాయకులు చేస్తున్న రాధ్దాంతం ప్రజలలో అనవసరమైన అపోహలు, ఆందోళనలు సృష్టిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.శరత్ అన్నారు.

20190416_143759_rmedited

సోమవారం అర్థరాత్రి ఈవిఎం ల తరలింపు అంశంపై మీడియా లో ప్రసారమైన వార్తా కథనాలపై ఆయన స్పందిస్తూ…అర్థరాత్రి ఈవిఎం ల తరలింపు అంశం అంతా అనుమానం , అపోహలేనని కొట్టిపారేశారు. అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రాజేశం కూడా ఈ అంశంపై విచారణ చేపట్టి, వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.శరత్ మంగళవారం మినీ స్టేడియంలోని ఈవిఎం ల స్ట్రాంగ్ రూం ను పరిశీలించారు..
అనంతరం…ఆయన మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి ఈవిఎం ల తరలింపు అంశం సరైనది కాదన్నారు. ప్రజల్లో , రాజకీయ నాయకుల్లో ఎన్నికల యంత్రాంగంపై అపోహలు కల్గించాయన్నారు.

మీడియా ఈ అంశంలో ప్రసారం గావించిన వార్తా కథనాలపై కొంత అసహనం వ్యక్తం చేశారు.

ఆటోలో ఈవిఎం ల తరలింపు పై ఆయన వివరణ ఇస్తూ….ఆటోలో తరలించిన ఈవిఎంలు ఎం-2 ఈవిఎం లని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ అనంతరం ఓటర్లకు ఈవిఎం ల ద్వారా అవగాహన కల్పించడం కోసం గాను మండలానికి పది ఎం-2 ఈవిఎం లను సంబంధిత మండల తహసీల్దార్లకు ఇవ్వడం జరిగిందన్నారు.

అలాగే, ముందుగా,ఎం-2 ల ఈవిఎం ల స్ట్రాంగ్ రూం ను మినీస్టేడియంలో ఉంచడం జరిగిందన్నారు ఐతే, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులుండడంతో ఎం-2 ఈవిఎం ల స్థానంలో ఎం-3 ఈవిఎం లను వాడిన సంగతి మీడియా కు,రాజకీయ పార్టీల నాయ కులకూ తెల్సిందేనన్నారు.అంతేగాకుండా, ఈవిఎం ల ద్వారా ఓటింగ్ పై మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన కల్పించిన సంగతీతెల్సిందేననన్నారు.

DSC_3507

పోలింగ్ అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, పోలీసు బందోబస్తు నడుమ ఈవిఎం లను విఆర్ కె ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచడం జరిగిందన్నారు.

DSC_3499

అంతేగాక, దాదాపు 10 కి.మీ. దూరంలో ఉన్న ఆ కళాశాలలో పూర్తి భద్రత ఉందని వివరించారు. పట్టణ నడి బొడ్డున ఉన్న మినీస్టేడియం స్ట్రాంగ్ రూంకు మండలాలలో ఓటర్ల అవగాహన కోసం కేటాయించిన ఎం-2 ఈవిఎం లను భద్రపరచడానికి తీసుకువెళ్లడం జరిగింది తప్ప మరోటి కాదన్నారు.

ఏది ఏమైనా, అర్ధరాత్రి ఆటోలో ఈవిఎం ల తరలింపు లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని, క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయడం జరుగుతుందని మరోసారి హెచ్చరించారు.