ఈ నెల 26నుండి మార్చి 10వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా…. శ్రీ లక్ష్మి నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం..

dharmapuri sri laxmi nrusimha swamy

TELANGANA REPORTER LOGO - 1x7

ధర్మపురి 25 ఫిబ్రవరి: ✍మధు మహదేవ్…mahadev www.telanganareporter.news

👉26 నుండి ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం .
👉బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ధర్మపురి క్షేత్రం
👉భక్తుల సౌకర్యాల ఫై ప్రత్యేక దృష్టి
👉26 నుండి మార్చి 10 వరకు బ్రహ్మోత్సవాలు
👉ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్…

IMG-20180225-WA0506

దక్షిణ కాశీ గా ప్రసిద్ది గాంచిన ధర్మపురి క్షేత్ర తీర్థంలో శ్రీ లక్ష్మి నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం ఐంది….

dmp k

 

ఈ నెల 26నుండి మార్చి 10వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అటు దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఇటు పాలకమండలి సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారు…

IMG-20180225-WA0505

స్థానిక ఎం ల్ ఏ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, జిల్లా ఎస్ పి బి. అనంత శర్మ గత వారం క్రితమే....అన్ని శాఖల అధికారులతో, ఆలయ ఇ వో  శ్రీమతి నాయిని సుప్రియ,  పాలక మండలి అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచి శ్రీమతి సంగి సత్తమ్మ తదితరులతో. సమీక్షా సమావేశం నిర్వహించారు . 

IMG-20180225-WA0508

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు అధికారవర్గాలు తెలిపాయి . ముగ్గురు స్వాముల ఉత్సవాలను సంప్రదాయరీతిలో నిర్వహించుటకు దేవస్థానం అన్ని చర్యలు ఏర్పాట్లు చేసినట్లు ఇ వో నాయిని సుప్రియ తెలిపారు .

IMG-20180225-WA0510

26వ తేది నుండి మార్చి 10వ తేది వరకు ప్రధానంగా 27న ముగ్గురు స్వాముల కళ్యాణఉత్సవం  వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

IMG-20180225-WA0503

మార్చి 1,2,3 తేదీలలో మూడురోజుల పాటు బ్రహ్మ పుష్కరిణిలో మధాహ్నం ౩ గంటల నుండి రాత్రి 7 గంటలవరకు తెప్పోత్సవ డోలోత్సవాలు ,

IMG-20180225-WA0509

7 వ తేదిన రథోత్సవం కార్యక్రమాలను నిర్వహించ నున్నారు.

28166349_1967402829969052_4834071866294876963_n

ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు, యాత్రికులకు అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు..దేవాలయాల లోపల బయట అవసరమైన చోట్ల ప్రధానాలయంలో…..

IMG-20180225-WA0511

వివిధ ఆలయాల బయట నీడనిచ్చే చలువ పందిళ్ళను, దేవస్థానం లోపల వివిధ శాఖల అవసరాలకు తగిన విధంగా తాత్కాలిక షెడ్లు , క్యూలైన్ల ను ,మంచి నీటి సౌకర్యాలను ,వివిధ ప్రదేశాలలో చలివేంద్రాల నిర్వహణకు షెడ్లను వేసారు.

IMG-20180225-WA0512

గతంలోగా కాకుండా భక్తుల క్యూ లైన్ల ప్రదేశాలలో తాత్కాలిక పందిళ్లను ఏర్పాటు చేశారు.దేవస్థానం బయట ఐరన్ పైప్ లతో క్యూలైన్ లను ఏర్పాటు చేసారు .

జాతర సమయంలో భక్తుల నిత్యాన్నదానం, వాహనాల పార్కింగ్ , నీటి సరఫరా , పారిశుద్యం, అదనంగా విద్యుత్ దీపాలంకరణ, గోదావరి నది తీరం లోతైన ప్రాంతాల్లోకి భక్తులు వెళ్ళకుండా పలు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు.

IMG-20180225-WA0504

స్త్రీలు బట్టలు మార్చుకోవడాని వీలుగా గదులను కుడా ఏర్పాటు చేసారు..జగిత్యాల , మెటుపల్లి, మున్సిపల్  పారిశుధ్య  సిబ్బంది ,ధర్మపురి పంచాయతి సంబంధ సిబ్బందికి తోడుగా మరో 200 మంది పారిశుధ్య తాత్కాలిక సిబ్బందిని గోదావరి నదిలో, పట్టణంలో ఉత్సవాల సమయంలో పడ్డ చెత్త చెదారంను తొలగించుటకు నియమించినట్లు అధికారులు, పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు తెలిపారు…