ఉజ్వల భవితకు వారధి విద్య…. 👉అలరించిన సాంస్కృతిక దినోత్సవం

తెలంగాణ రిపోర్టర్ , డా.మధు మహదేవ్ శర్మ, ధర్మపురి, 17నవంబర్

ధర్మపురి మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

IMG-20181117-WA1031

ఆంగ్లో వేదిక్ కాన్వెంట్ హై స్కూల్ , శ్రీ వాణీ విద్యాలయం ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవాన్ని ముఖ్య అతిథులు ఐ.శ్రీనివాస్,ఐ.రాంకిషన్ ,పెండ్యాల మహేందర్ లు మరియు పాఠశాల కరస్పాండెంట్ సంగనభట్ల దినేష్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు డైరెక్టర్లు తోట శంకర్ గట్ల శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

IMG-20181117-WA1033

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ….ఉజ్వల భవితకు వారధి విద్య అని విద్యార్జనతోనే విద్యార్థులు సమాజంలో ఉన్నతస్థానంలో ఉంటారని, సత్ప్రవర్తనతో మెలిగి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని పలువురు వక్తలు విద్యార్ధులకు దిశా నిర్దేశం చేసారు.

IMG-20181117-WA1032

నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మనోభావాలను గౌరవిస్తూ సత్ప్రవర్తనతో మసులు కోవాలని తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు గురువులకు దేశానికి గొప్పనైన కీర్తిప్రతిష్టలు తీసుకురావడానికి విద్యార్థులు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.

IMG-20181117-WA1036

అనంతరం అన్ని తరగతుల విద్యార్థినీ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్నారు పలువురు చిన్నారులు సాంస్కృతిక,భారతీయ వేషధారణలతో చేసిన నృత్యాలు  ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.