ఎంపి కల్వకుంట్ల కవిత కు మాలల ఐక్య వేదిక నాయకులు ఒక లక్ష 16 వేల రూపాయల చెక్ అందజేత

నిజామాబాద్, మార్చి15: sircilla srinivas, 9849162111


IMG-20190315-WA0483

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కు మాలల ఐక్య వేదిక నాయకులు ఒక లక్ష 16 వేల రూపాయల చెక్ ను అందజేశారు.

IMG-20190315-WA0459

ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, రవాణా శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి గౌడ్, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే లు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ లు పాల్గొన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన కవితకు ఎన్నికల ఖర్చు కోసం మాలలు ప్రతి ఇంటి నుంచి కొంత నగదును విరాళాల రూపంలో సేకరించిన విషయం తెలిసిందే.

శుక్రవారం నిజామాబాదు లోని ఎంపీ కవిత ను మాలల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా చైర్మన్ జి. జనార్ధన్, కో చైర్మన్ పి. స్వామి ఆధ్వర్యంలో వేదిక నాయకులు కవితని కలిసి చెక్ ను అందజేసి తమ ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు.

మాలల ఐక్య వేదిక జిల్లా మోహనరావు, ఎల్లం, భూమయ్య, దేవిదాస్. సురేష్ ,లక్ష్మీ నారాయణ, లింగయ్య. ధనరాజు .శ్రీనివాస్ , నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, గోసంగి, మోచి సంఘం, మాల జంగం, ఇతర దళిత సంఘాల జిల్లా నాయకులు ఎంపీ కవిత ను సన్మానించారు.

దళితుల అభివృద్ధికి కృషిచేసిన కవితను మళ్లీ ఎంపీగా గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.