ఏకంగా ఆరు : చైనాకు వెన్నులో వణుకే!

India begins process to build 6 nuclear submarines - Sakshi

చైనాను అంతర్జాతీయంగా ఇప్పటికే పూర్తిగా ఇరుకున పెట్టిన భారత్‌.. తాజాగా మరో అడుగు ముదుకేసింది, డోక్లాం వివాదం తరువాత సరిహద్దుల్లో భారత్‌ భద్రతను కట్టు దిట్టం చేసింది. ఇప్పటివరకూ న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లపై పెద్దగా దృష్టిపెట్టని భారత్‌.. ఏక కాలంలో ఆరు న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా స్పష్టం చేశారు. భారత నేవీ సామర్థ్యాన్ని ఇవి పరిపుష్టం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని భారత్‌ సవాల్‌ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమికి స్థిరమైన ఆకృతిని తీసుకురావంలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో చైనాకు చెక్‌ పెట్టే శక్తి ఒక్క భారత్‌కు మాత్రమే ఉందని ఆయన చెప్పారు.