ఐఏఎస్ లేదా ఐపిఎస్ అవ్వాలనుకుంటున్నారా…అయితే… “యువగ్యాని టెస్ట్” రాయండి:

వరంగల్: ఏప్రిల్ 13: తెలంగాణ రిపోర్టర్…www.telanganareporter.news


IMG-20190413-WA0443
ఐఏఎస్ లేదా ఐపిఎస్ అవ్వాలని చాలామందికి కోరిక ఉంటుంది…. ప్రస్తుత కాలంలో సివిల్ సర్వీసెస్ పరిధి ఎంతో విసృతం అయ్యింది…. ఎంతోమంది విద్యార్ధులు ఐఏఎస్ కావాలి అని కలలు కంటున్నారు. ఈ కలని సాకారం చేసుకోవడానికి చాలామంది విద్యార్ధులు నిత్యం కృషి చేస్తున్నారు…. అలాంటి కల మీరు కూడా స్వంతం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న “యువగ్యాని టెస్ట్” ని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్ధులు వ్రాయవచ్చు.
IMG-20190413-WA0436
ఇందులో మొదట వచ్చిన ముగ్గురు 10వ తరగతి విద్యార్ధులకు ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ వారు పూర్తిగా 5 సంవత్సరాలు ఉచిత సివిల్స్ కోచింగ్ ఇస్తారు. అలానే మొదట వచ్చిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ వారు పూర్తిగా 3 సంవత్సరాలు ఉచిత సివిల్స్ కోచింగ్ ఇస్తారు….
IMG-20190413-WA0432
ఈ నేపథ్యంలో…. శనివారం వరంగల్ లోని ‘గురుకుల్ ది స్కూల్‘ లో జరిగిన “యువగ్యాని టెస్ట్” రాయడానికి ఉదయం 10 – 1 వరకు 100 పైగా విద్యార్దులు హాజరయ్యారు.
IMG-20190413-WA0431
పరీక్ష అనంతరం జరిగిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా  విచ్చేసిన యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఆర్ట్ అండ్ సైన్సు, కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య  విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ… “పిల్లలు క్రమశిక్షణతో వారి లక్ష్యం వైపు పెద్దవారి మార్గదర్సకత్వంలో ముందుకు వెళ్ళగలిగితే, వారికి ఎలాంటి భయాలు ఉండకుండా ఐఎఎస్ లేదా ఐపిఎస్ అవ్వచ్చు. అలానే కృషి ఉంటే ఎలాంటి కష్టమైన పని అయినా ఉత్తేజంతో, ఇష్టంగా సాధించగలరు. అలాగే భావితరాల వారికి దొరుకుతున్న ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్ధులు ఉపయోగించుకోవాలి” అని అన్నారు.
IMG-20190413-WA0442
మాథ్స్ ప్రొఫెసర్ కందాల రామయ్య మాట్లాడుతూ... “పిల్లలు ఏ విధంగా జీవితంలో పైకి ఎదగడానికి ఒక లక్ష్యం ఏర్పరుచుకుని దాన్ని సాధించడానికి ఎలా కృషి చేయాలి” అని చెప్పారు. గురుకుల్ ది స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత రెడ్డి మాట్లాడుతూ “ఈ దేశానికి సివిల్ సర్వెంట్స్ అవసరం ఎంతో ఉంది అని, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సివిల్ సర్వెంట్స్ లేనందు వల్ల ఈ టెస్ట్ ఎంతో మంది పిల్లలకి ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.
IMG-20190413-WA0433
ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) చీఫ్ మెంటార్ ఎన్.ఎస్. రెడ్డి  మాట్లాడుతూ… “అసలు మీరు ఐఎఎస్ లేదా ఐపిఎస్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు? డబ్బు కోసమా? సమాజం కోసమా? గౌరవం కోసమా? ఇలా మొదట మీకు మీరు ఆలోచించుకుని ఆ తరువాత సివిల్స్ కోసం తయారు అవ్వాలి. అలానే గొప్ప గొప్ప వారి పిల్లలే ఐఎఎస్, ఐపిఎస్ అవుతున్నారు అంటే మీరు పొరపాటు పడ్డట్లే. అసలు పరీక్ష గురించి అవగాహన ఉండి, మంచి మార్గదర్శకత్వంలో చదివితే తప్పక ఐఎఎస్ లేదా ఐపిఎస్ అవుతారు. అలానే ఢిల్లీ దాకా వెళ్ళి చదువుకునే అవసరం లేదు, మంచి ప్రణాళికతో చదివితే ఎన్నో అద్భుతాలు సృస్టించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మన సమాజంలో, మన చుట్టూ జరుగుతున్న విషయాలను అర్ధం చేసుకుని, వాటిని విశ్లేషించే సత్తా ఉంటే చాలు విజయం సాధించడం ఏమి గొప్ప విషయం కాదు” అని తల్లితండ్రులకి, విద్యార్ధులకి ఉన్న ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు.
యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధి నిఖిల్ గుండ మాట్లాడుతూ… “విద్యార్ధులు ఎవరైనా సరే తాము ఎంచుకోవాల్సిన వృత్తి గురించి కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అవి:
IMG-20190413-WA0444
1. పరిశోధన: విద్యార్ధులు తాము ఎంచుకోవాలి అనుకుంటున్న వృత్తి ఏదైనా సరే మార్కెట్ లో దాని గురించి పరిశోధన చేయాలి.
2. విశ్లేషణ: మీరు ఎక్కడ సరిపోతారు. మీరు అంతర్ముఖులా లేదా అందరితో కలవడం ఇష్టమా? అనేది గుర్తించాలి
3. మీ బలాలు గుర్తించి వాటిని మీ కెరీర్ తో సరిపోల్చుకోవాలి
4. “ఎందుకు & ఎలా” తెలుసుకోవడం ముఖ్యం. మీకు ఎందుకు అని తెలిస్తే, ఎలా అనేది తెలిసిపోతుంది అని ఉదాహరణలతో తెలియచేశారు.
5. ఏదైనా పని చేసేప్పుడు స్మార్ట్ వర్క్ చేయడాన్ని ఎంచుకోవాలా లేదా హార్డ్ వర్క్ ని ఎంచుకోవాలా
6. తెలివిగా సమయం ఉపయోగించుకోవాలి మరియు ఇతరుల సమయానికి కూడా విలువ ఇవ్వడం నేర్చుకోవాలి “ అని నిఖిల్ గారు విద్యార్ధులకి మంచి సలహాలు ఇచ్చారు.
ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) ప్రిన్సిపల్ జాన్ రూఫస్ మాట్లాడుతూ “విద్యార్ధులు సివిల్స్ సాధించడానికి మూడు ముఖ్యమైన సూచనలు చేశారు 1) ప్రేరణ 2) క్రమశిక్షణ 3) మెంటార్షిప్ (ఒక గురువు దగ్గర నేర్చుకోవడం) ఈ మూడు సూచనలు పాటిస్తే విద్యార్ధులు ఈజీగా సివిల్స్ సాధించగలరు అని, అలానే ఎందుకు సివిల్ సర్వీసెస్ ని ఎంచుకోవాలి అంటే 1) తల్లితండ్రుల కోరిక 2) గౌరవప్రదమైన ఉద్యోగం 3) ప్రభావంతమైన ఉద్యోగం 4) ప్రోత్సాహకాలు” అని విద్యార్ధులకి సలహాలు, సూచనలు ఇచ్చారు.
-ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్దులలో గెలుపొందిన వారిని త్వరలో జరిగే గ్రాండ్ టెస్ట్ కి ఆహ్వానించడం జరుగుతుంది.
ఈ నెల 15వ తేది నిజామాబాదు జిల్లాలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో ఉదయం 10 – 1 వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధులు ఫణీంద్ర, అక్షయ్, భార్గవ్, హరీష్, సల్మాన్ మాలిక్ తెలియచేశారు. ఉచితంగా మీ పేరు నమోదు చేసుకోవడానికి www.yuvagyani.com సంప్రదించండి లేదా ఈ నెంబర్లకి ఫోన్ చేయండి:       9000014827, 9000014830.