ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క!!!!…

ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క

నాలుగేళ్ళ ప్రేమాయణం ఏడడుగుల బంధంతో వారిద్దర్ని ఒక్కటి చేసింది. సుదీర్ఘ కాలపు ఊహాగానాలకు తెరదించుతున్నట్టుగా క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వారి ట్వీటర్‌ ఖాతాలో పెళ్ళి ఫోటోలు సాక్షిగా తమ వివాహం జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, కొద్ది మంది స్నేహితుల మద్య విరాట్‌-అనుష్క వివాహం వారు కోరుకున్నట్టుగా అత్యంత నిరాడంబరంగా జరిగింది.