కంచర్ల గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్… మిషన్ భగీరథ నీటి పై అవగాహన… 

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-


వీర్నపల్లి మండలంలోని కంచర్ల గ్రామాన్ని శనివారం రోజున జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి సందర్శించారు. గత కొద్దిరోజులుగా గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్న సంగతి విదితమే…,మిషన్ భగీరథ నీరు త్రాగడం ద్వారానే జ్వరాలు వస్తున్నాయని, స్థానికంగా లభించే నీటిని మాత్రమే సేవిస్తున్నారు. జ్వరాలు తగ్గుముఖం పట్టకుండా డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందడంతో కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

IMG-20190420-WA0533
మిషన్ భగీరథ నీటి వల్ల జ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు తెలపడంతో వారికి అవగాహన కల్పించారు . జిల్లాలో391 హాబీటేషన్స్ ద్వారా 10 గ్రామాలకు నీరు అందిస్తున్నామని, ఎక్కడ సమస్యలు లేవని కంచర్ల గ్రామంలో ఎందుకు సమస్యలు తలెత్తుతాయి అని గ్రామస్తులతో చర్చించారు.
స్థానికంగా వాడుతున్న నీరు కలుషితం అయినది అని, పాత నీటి బకెట్టులను, తొట్టిలను 3రోజుల పాటు వాడకుండా నీటిగా కడిగి దోమల లార్వా పూర్తిగా క్షిణించే వరకు ఎండబెట్టాలని తెలిపారు. కొత్త బకెట్లు వాడి మూడు రోజుల తరువాత సమస్య పరిష్కారం ఐనది లేదు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుందాం అని అన్నారు.
గ్రామస్తులు వ్యక్తి గత శుభ్రత పాటించి జ్వరాలు పారద్రోలి అధికారులు ఇస్తున్న సూచనలు పాటించి సహకరించాలని కోరారు.
సోమవారం నుండి మూడు రోజులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు.జ్వరాలతో కరీంనగర్ నగర్ దూరప్రాంతాలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఎల్లారెడ్డిపేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష కేంద్రం 5 లక్షల తో ఏర్పాటు చేశామని,ఇక్కడే వైద్యం అందుబాటులో ఉంటుంది అని    తెలిపారు.
మూడు రోజుల తరువాత జ్వరాలు ఎవ్వరికీ ఉండకూడదని అందరూ అధికారులు చేపట్టిన చర్యలకు సహకరించాలని కోరారు. మూడు రోజుల తరువాత 280 ఇండ్లలో పరిశీలించి చూస్తామని ప్రతిఒక్కరు మేము చెప్పిన విదంగా నడవాలని అన్నారు.
మూడురోజుల తరువాత అధికారులం అందరం ఇదే నీరు తగుతామని అనంతరం మీరు తాగండి అని గ్రామస్తులకు మిషన్ భగీరథ నీటి పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. వైద్య అధికారులు మురికి కాలువలు పరిశీలించి పారిశుద్ధ్య పనుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటుగా,జిల్లా వైద్య అధికారి చెంద్రశేకర్, ఆర్ డి ఓ శ్రీనివాస్, వైద్యులు సుమన్,ఎల్లారెడ్డిపేట్ వైద్య అధికారి మీనాక్షి గ్రామస్తులు పాల్గొన్నారు…
Attachments area