కన్నుల పండువగా తిరు కల్యాణోత్సవం 👉మూడు రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించిన నారాయణుడు

👉అపూర్వ సంప్రదాయం- ధర్మపురి క్షేత్రం

https://youtu.be/sRry0FayMjM

ధర్మపురి మార్చి 18 , తెలంగాణ రిపోర్టర్
డా. మధు మహాదేవ్ శర్మ


dharmapuri-sri-laxmi-nrusimha-swamy-1024x683

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీ స్వామివారల తిరుకల్యాణోత్సవం సోమవారం సాయంకాలము ప్రదోష కాలంలో గోధూళి సుముహూర్తమందు కన్నుల పండువగా జరిగింది.

IMG-20190315-WA0448

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం గోదావరి తీరాన వెలసిన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శిస్తే, అనంతమైన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం
అందుకే ప్రతి నిత్యం ధర్మపురి క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది.

IMG-20190315-WA0444

ప్రతియేటా నిర్వహించే మాదిరిగానే ఫాల్గుణ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫాల్గుణ శుద్ధ ద్వాదశి శుభముహూర్తాన స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు
. మరే క్షేత్రంలో లేని విధంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీమన్నారాయణుడు ధర్మపురి క్షేత్రం లో మూడు రూపాల్లో కళ్యాణమహోత్సవాన్ని జరిపించుకోవడం ఇక్కడి విశేషం.

IMG-20190315-WA0452

శ్రీలక్ష్మీ సమేత శ్రీ యోగ నరసింహునిగా, లక్ష్మీ సమేత ఉగ్ర నారసింహుడిగా శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామిగా ఆ వైకుంఠపతి ఇక్కడ కొలువై ఉన్నాడు.

ముగ్గురు దేవతామూర్తులకు ఒకేసారి ఒకే వేదికపై కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించడం ధర్మపురి అపూర్వ సంప్రదాయం
స్వామి వారల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థాన ప్రాంగణంలోని శేషప్ప కళావేదిక ను అత్యద్భుతంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

IMG-20190318-WA0822

నానావిధాని పుష్పాని“ అన్నట్లుగా రంగురంగుల పూలతో పంచ పల్లవులతో నారికేళ వృక్ష సంపదతో కళ్యాణ వేదికను అందంగా తీర్చిదిద్దారు.

IMG-20190318-WA0819

ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్ప వేదికపై శ్రీ యోగ ఉగ్ర నరసింహ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారల ఉత్సవ కళ్యాణమూర్తులను ఆసీనులను గావించి, మంగళ వాయిద్యముల మధ్య వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అశేష భక్తజన జయజయధ్వానాల మధ్య శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
నభూతో నభవిష్యత్తు అన్న విధంగా నిర్వహించారు.

IMG-20190318-WA0815

జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్ సాంప్రదాయబద్దంగా,  పట్టు  వస్త్రాలను  స్వామివారికి అందజేశారు. ఆయన వెంట ఆర్డీఓ నరేందర్ , తహసిల్దార్ వెంకటరెడ్డి, ఆలయ ఈఓ, డిప్యూటి కలెక్టర్ పి.అమరేందర్, వేములవాడ దేవస్తానం ఈఓ దూస రాజేశ్వర్, ధర్మకర్తల మండలి చైర్మెన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మండలి సభ్యులు ఉన్నారు.

IMG-20190318-WA0818

రాష్ట్రం నలుమూలల నుండే కాక మహారాష్ట్ర, నాందేడ్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం
అంటూ భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించి ఆనంద తన్మయత్వంలో మునిగితేలారు.

IMG-20190318-WA0817

గోదావరి తీరాన వెలసిన ప్రహ్లాద నరసింహుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు గా కల్యాణ మహోత్సవ రోజున అశేష భక్త జనం నీరాజనాలు అందుకున్నాడు.

IMG-20190318-WA0814

ఒకే వేదికపై ముగ్గురు దేవతామూర్తుల దివ్య పరిణయమహోత్సవాన్ని నిర్వహించే అపూర్వ సంప్రదాయం ధర్మపురి క్షేత్రాన్ని సనాతనంగా వస్తున్న ఆచారం.
బ్రహ్మోత్సవాల విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

పవిత్రతతో పాటు రుచికరమైన భోజనాన్ని దేవస్థాన పక్షాన అశేష జనానికి అన్న ప్రసాదాన్ని అందజేశారు.

IMG-20190318-WA0517

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో లో డిఎస్పి వెంకటరమణ, ధర్మపురి సిఐ లక్ష్మీ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ లు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ముందస్తుగా సూచించిన ప్రకారం వాహన పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాన్ని గుర్తించడంతో కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు.