కమనీయం ఉగ్ర నరసింహుని తెప్పోత్సవ డోలోత్సవం

👉కొత్త నరసింహస్వామి కొబ్బరి బెల్లాలు…… గోవిందా….. గోవిందా
👉కమనీయం ఉగ్ర నరసింహుని తెప్పోత్సవ డోలోత్సవం

IMG-20190315-WA0444

ధర్మపురి 21 మార్చి 2019 తెలంగాణ రిపోర్టర్, డా. మధు మహాదేవ్ శర్మ


IMG-20190315-WA0448

నరసింహ దేవాలయాలు దేశంలో ఎక్కడ చూసినా కొండలపై ననో ఎత్తైన ప్రదేశాల పైన నో తరచూ మనకు దర్శనమిస్తాయి.

కానీ, ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై దశావతార సహిత సాలగ్రామ స్వయంభు విగ్రహ రూపంలో వామాంకమున లక్ష్మీ సమేతుడై విరాజిల్లుతునారు.

నరసింహుడు యోగ మూర్తిగా, ఉగ్రమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్న ఏకైక క్షేత్రం ధర్మపురి.

కళ్యాణ మహోత్సవం  అనంతరం మూడవ రోజున శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారికి బ్రహ్మ పుష్కరిణి కోనేరులో ఉత్సవాలు నిర్వహించడం అనాది ఆచారం.
ఉగ్ర నరసింహ స్వామి ఉత్సవానికి స్థానికులు విశేష ప్రాముఖ్యాన్ని ఇస్తుంటారు.

IMG-20190321-WA0792

ఆలయంలోని ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం రెండు శిరస్సులతో భక్తులకు దర్శనమిస్తుంది. సహజంగా చూడగానే పంచవక్త్ర నరసింహ స్వామి మనకు దర్శనమిస్తుంటే పంచవక్త్ర స్వామి శిరస్సు పై భాగాన నరరూప మరో శిరస్సు ఉండటం ఈ విగ్రహ ప్రాధాన్యత.

IMG-20190321-WA0793

దశ దిక్పాలకులతో దిగ్బంధనం చేయబడిన ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనది. చాలామంది మానసిక రోగులు, గ్రహ బాధితులతో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ స్వామి వారికి మొక్కులు చెల్లించడంతో వారి ఈతి బాధలు అన్ని తొలగి పోతుండడంతో ఈ స్వామి వారికి స్థానికులు విశేష ప్రాధాన్యం ఇస్తారు.

IMG-20190321-WA0795

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన సేవ పైన ఆసీనుల గావించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాద్య ఘోషల తో బ్రహ్మ పుష్కరిణిలోకి స్వామివారిని తీసుకొని వచ్చారు.

IMG-20190321-WA0798

పుష్కరిణిలో తెప్పోత్సవానికై ఏర్పాటుచేసిన హంస వాహనం పైన శ్రీ లక్ష్మీ సమేత ఉగ్ర నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి పుష్కరిణిలో ఐదు ప్రదక్షణములు నిర్వహించారు.

ప్రదక్షిణ సమయాన భక్తులు స్వామివారి తెప్పను అనుసరిస్తూ… స్వామివారిని కీర్తిస్తూ, మహిళలు కోలాటం వేస్తూ…స్వామివారి పై బుక్క గులాలు చిలకరిస్తూ…. కొత్త నరసింహస్వామి కొబ్బరి బెళ్లాలు గోవిందా గోవిందా”*
అంటూ సకుటుంబంగా ప్రదక్షిణ గావించి పుష్కర తీర్థాన్ని శిరస్సులపై చల్లుకుని పునీతులైనారు.

అనంతరం స్వామి వారిని పుష్కరిణి మధ్యలో గల భోగ మంటపంపై ఉయ్యాలలో డోలోత్సవం నిర్వహించారు.

విశేష పూజ అనంతరం భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించి తరించారు.డోలోత్సవానంతరం స్వామిని మాడవీధులలో ఊరేగించి విశ్రాంత మండపంలో హారతీ నీరాంజనాలు సమర్పించి ఆలయ ఈఓ , చైర్మెన్ ధర్మకర్తలకు భక్తులకు అర్చకులు వేదపండితులు
వైదికఆశీస్సులు అందజేసారు.

ఈకార్యక్రమంలో భక్తులు , ఆలయ అధికారులు, చైర్మెన్ ధర్మకర్తలు పాల్గొన్నారు

భక్తుల ఆకలి తీ రుస్తున్న అన్నదానంఅన్నదానం…

IMG-20190318-WA0517

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధర్మపురి క్షేత్రానికి విచ్చేసి అశేష భక్తజనానికి స్వామివారి ప్రసాదాన్ని అందించాలన్న సత్సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అన్నదానం భక్తుల ఆకలి తీరుస్తుంది.

స్థానిక వర్తక వ్యాపారుల ఆలయ అనుసంధానంతో నిర్వహిస్తున్న అన్నంలో భక్తులకు రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించడం తో ఆలయ వర్గాలు భక్తుల కితాబు అందుకున్నాయి.గురువారం సైతం దాదాపు 6 వేల మందికి అన్నదానం నిర్వహించారు.

శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తెప్పోత్సవంతో ఉత్సవాలు మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దక్షిణ దిగ్యాత్ర కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు ఆలయ ఈవో అమరేందర్ , చైర్మన్ శ్రీకాంత్ లు తెలిపారు.