కర్నూల్ లో యువగ్యాని టెస్ట్….

కర్నూల్, ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్


ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా కర్నూల్ హోటల్ సూరజ్ గ్రాండ్ లో ఉదయం 10 – 1 వరకు నిర్వహించిన “యువగ్యాని టెస్ట్” కి ఎంతో మంది విద్యార్దులు పాల్గొని ఈ పరీక్షని ఘనంగా విజయవంతం చేశారు.

IMG-20190422-WA0237

ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన  కార్యక్రమంలో ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) ప్రిన్సిపల్ జాన్ రూఫస్ మాట్లాడుతూ “అసలు సివిల్స్ ఎందుకు, ఎలా, ఎప్పటినుంచి సాధించాలి దానికి కావాల్సిన మూడు ముఖ్యమైన సూచనలు చేశారు.

IMG-20190422-WA0238

1) ప్రేరణ 2) క్రమశిక్షణ 3) మెంటార్షిప్ (ఒక గురువు దగ్గర నేర్చుకోవడం) ఈ మూడు సూచనలు పాటిస్తే విద్యార్ధులు ఈజీగా సివిల్స్ సాధించగలరు అని, అలానే ఎందుకు సివిల్ సర్వీసెస్ ని ఎంచుకోవాలి అంటే 1) తల్లితండ్రుల కోరిక 2) గౌరవప్రదమైన ఉద్యోగం 3) ప్రభావంతమైన ఉద్యోగం 4) ప్రోత్సాహకాలు” అని విద్యార్ధులకి సలహాలు, సూచనలు ఇచ్చారు..

యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధి నిఖిల్ గుండ  మాట్లాడుతూ….. “విద్యార్ధులు ఎవరైనా సరే తాము ఎంచుకోవాల్సిన వృత్తి గురించి కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అవి:
1. పరిశోధన: విద్యార్ధులు తాము ఎంచుకోవాలి అనుకుంటున్న వృత్తి ఏదైనా సరే మార్కెట్ లో దాని గురించి పరిశోధన చేయాలి.
2. విశ్లేషణ: మీరు ఎక్కడ సరిపోతారు. మీరు అంతర్ముఖులా లేదా అందరితో కలవడం ఇష్టమా? అనేది గుర్తించాలి
3. మీ బలాలు గుర్తించి వాటిని మీ కెరీర్ తో సరిపోల్చుకోవాలి
4. “ఎందుకు & ఎలా” తెలుసుకోవడం ముఖ్యం. మీకు ఎందుకు అని తెలిస్తే, ఎలా అనేది తెలిసిపోతుంది అని ఉదాహరణలతో తెలియచేశారు.
5. ఏదైనా పని చేసేప్పుడు స్మార్ట్ వర్క్ చేయడాన్ని ఎంచుకోవాలా లేదా హార్డ్ వర్క్ ని ఎంచుకోవాలా
6. తెలివిగా సమయం ఉపయోగించుకోవాలి మరియు ఇతరుల సమయానికి కూడా విలువ ఇవ్వడం నేర్చుకోవాలి “ అని నిఖిల్ గారు విద్యార్ధులకి మంచి సలహాలు ఇచ్చారు.
23.04.19 వ తేదిన అనంతపూర్ అమరావతి లాడ్జ్, 24.04.19వ తేదిన కడప మానస ఇన్ లో ఈ పరీక్షని నిర్వహిస్తున్నామని, “ఎక్కువమంది యువత సివిల్స్ లో సీట్ తెచ్చుకుంటే, ఎక్కువ దేశ సేవ చేయవచ్చు అందుకే ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధులు తెలియచేశారు.

ఉచితంగా మీ పేరు నమోదు చేసుకోవడానికి www.yuvagyani.com సంప్రదించండి లేదా ఈ నెంబర్లకి ఫోన్ చేయండి: 9000014827, 9000014830.