కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీను అరెస్ట్

www.telaganareporter.news✍9394328296.

IMG-20190409-WA0024

కలప స్మగ్లర్ అరెస్ట్..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఏప్రిల్-9,తెలంగాణ రిపోర్టర్:- కరుడుగట్టిన కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్ గా పిలువబడే ఎడ్ల శ్రీను @ పోతారం శ్రీను ను రామగుండం కమీషనరేట్ లోని లా & ఆర్డర్, టాస్క్ ఫోర్సు, మంథని పోలీసులు పగడ్బంది సమాచారంతో అరెస్ట్ చేశారు..

IMG-20190409-WA0027IMG-20190409-WA0023ఈ మేరకు రామగుండం కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిపి సత్యనారాయణ నిందితుల వివరాలను వెల్లడించారు..

గత 20 సం.. లు గ విచక్షణ రాహిత్యంగా అడవులను నరుకుతూ టేకు స్మగ్లింగ్ లో ఆరితేరిన ఎడ్ల శ్రీను ను తెలంగాణ పోలీస్ మరియు అటవీ శాఖలు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా గుర్తించడం జరిగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రానున్న తరాలకు జివనాధారలైన అడవుల సంరక్షణకు అందరూ నడుమ్బుగించాలని అదేవిధంగా పర్యావరణ సమతుల్యానికి హాని కల్గించే మరియు అడవులు నరుకుతూ కలప స్మగ్లింగ్ చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు ఇవ్వడంతో అటవీ, పోలీస్ శాఖ అటవీ స్మగ్లర్ల జాబితాను సిద్దం చేసారు. ఆ జాబితాలో ప్రప్రదమైన మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ గా మంథని కి చెందిన ఎడ్ల శ్రీను నిలిచాడు. తెలంగాణ వీరప్పన్ అని పిలవబడే ఎడ్ల శ్రీను మూడు రాష్టాలు (తెలంగాణ, మహరాస్ట్ర, చత్తీస్ఘడ్) కు వాంటెడ్ క్రిమినల్ సాంకేతిక మరియు రాష్ట స్థాయి పోలీస్ ఎజేన్సీల సహాయంతో పక్క ఆధారాలతో రామగుండం కమీషనరేట్ పోలీసులు ఎడ్ల శ్రీనును అరెస్ట్ చేయడం జరిగింది.
*ఎడ్ల శ్రీను తో పాటు కలప స్మగ్లింగ్ లో అత్యంత కీలక పాత్ర పోషించే (4) వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది*

IMG-20190409-WA0035
పరారిలో నిష్ణాతుడు :
గత 20 సం.. లు గా యదేచ్చగా, నిరంతరంగా కలప స్మగ్లింగ్ చేస్తున్న ఎడ్ల శ్రీను అందరికి సుపరిచుతుడైనప్పటికి, అందరితో ఎప్పటికి కలిసున్నప్పటికి పోలీసు, అటవీ శాఖ వారు అతనిపై ఏదైనా కేసు నమోదు చేసేటప్పటికి అతను అదృశ్యమవుతాడు. పెద్ద నెట్ వర్కింగ్ తో పోలీసు, అటవీ శాఖకి దొరక కుండ కోర్ట్ బెయిల్ ద్వారా, లేదా రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని కేసులలో కేవలం అతని అనుచరులు, దొరికిన వారిపై కేసులు పెట్టేలాగా చేసి అతనిపై కేసు నమోదు కాలేదని రూడి చేసుకున్న తర్వాత ప్రజలలోకి రావడం జరుగుతుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం అటవీ సంరక్షణపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ఇతని పేరు పోలీస్ వారి జాబితాలో అగ్ర భాగం లో ఉండడంతో అజ్ఞాతం లోకి వెళ్ళాడు. ఇలా అజ్ఞాతం లోకి వెళ్ళడానికి పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులు పూర్తి స్థాయి లో సహకరించారు. ఇతనిపై పోలీస్ వేట మొదలైనప్పటినుండి ఇతను అనేక ప్రాంతాలు అయిన హైదరాబాద్, విజయవాడ, తూర్పు గోదావరి, అన్నవరం, విశాఖపట్నం, అరకు, గుంటూరు, చిలకలూరిపేట, బద్రాచలం, వరంగల్ లలో తలదాచుకున్నాడు. ఇతను ఒక్కసారి వాడిన సిమ్ ను మరల ఉపయోగించకుండా జాగ్రత్త పడ్డాడు. గౌరవ కోర్ట్ లలో *రిట్ & మాండమస్* పిటిషన్ లు వేసి పోలీస్ అరెస్ట్ చేయకుండా PD ఆక్ట్ పెట్టకుండా ఉత్తర్వులు తేవాలని విశ్వ ప్రయత్నం చేసాడు.
సోషల్ మీడియా లో మరియు ఇతర మీడియా లలో కొంత మంది లాయర్ లు అతని యొక్క హితులు పోలీస్ శాఖ ని డిఫెన్సు లో పడవేయడానికి తద్వారా అరెస్ట్ కాకుండా ఉండడానికి చేయని ప్రయత్నం లేదు పన్నని ఎత్తుగడ లేదు. అయినప్పటికీ రామగుండం కమీషనరేట్ పోలిస్ దృడ నిశ్చయంతో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
ఎడ్ల శ్రీను నేర చరిత్ర :
తెలంగాణా వీరప్పన్ గా పిలవబడే ఎడ్ల శ్రీను @ పోతారం శ్రీనివాసు s/o లేట్ రాజయ్య ,వయస్సు :42 సం ,, నివాసం :పోతారం ,మంథని పెద్దపల్లి జిల్లా నివాసి ఇతను మొదటగా తన జీవన ఆధారం కోసం ఫెర్టిలైజర్ వ్యాపారం చేయాలనీ 1999 సం,,లో మయూరి పేరుతో ఫెర్టిలైజర్ వ్యాపారం ప్రారంభించడం జరిగింది ,అలా మొదలైన వ్యాపారంను క్రమంగా నష్టాలు రావడంతో తనకు ఉన్న పరిచయాలతో అటవీ ప్రాంతాలనుండి సైకిల్ ద్వారా కలప అక్రమ రవాణా చేసే వారి వద్ద నుండి కొని కొంత కమీషన్ తో ఇతరులకు అమ్మి డబ్బులు సంపాదించే వాడు అలా అక్రమ వ్యాపారంలో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారం కొనసాగిస్తూ 2009 సం ,, లో ఫెర్టిలైజర్ వ్యాపారం పూర్తిగా వదిలివేసి అప్పటినుండి ఇతనే స్వయంగా తనకు నమ్మకస్తులైన కొంత మంది వ్యక్తులతో కలిసి కలప అక్రమ వ్యాపారం మొదలు పెట్టి ఒక మాఫియా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని మారుమూల అటవీ ప్రాంత ప్రజల అవసరాలకు డబ్బు ఆశ చూపించి ఉమ్మడి కరీంనగర్,ఉమ్మడి ఆదిలాబాద్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాల మరియు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతాలలో చెట్లను నరికి తెలంగాణా వీరప్పన్ గా తన పేరు పిలువ బడుతూ కలప అక్రమ రవాణా చేస్తున్నాడు .
ఎడ్ల శ్రీను పై ఉన్న కేసుల వివరములు :
ఇప్పటివరకు ఎడ్ల శ్రీను పై పోలీస్,అటవీ శాఖ వారు నమోదు చేసిన మొత్తం కేసులు…..(12 )
మంథని పోలీస్ స్టేషన్ పరిదిలో నమోదైన కేసుల వివరములు :
1. CR.NO 04/19 SEC OF LAW 109,382 IPC SEC 07 R/W 20 (1)(C) (III),SEC 20 OF AP FOREST ACT
2. CR.NO 19/19 ,SEC OF LAW 420,506 IPC
3. CR.NO 25/19 SEC OF LAW 143,147,379,382 R/W 149 IPC SEC 07 R/W 20 (1)(C) (III),SEC 20 OF AP FOREST ACT
4. CR.NO 26/19 SEC OF LAW 143,147,379,382 R/W 149 IPC SEC 07 R/W 20 (1)(C) (III),SEC 20 OF AP FOREST ACT
5. CR.NO 242/12 SEC OF LAW 379 IPC
6. CR.NO 54/19 SEC OF LAW 379 IPC
కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో నమోదైన కేసుల వివరములు :
7.CR.NO 11/19 SEC OF LAW 379 IPC SEC 21&22 OF AP FOREST ACT
8.CR.NO 13/19 SEC OF LAW 379 IPC SEC 21&22 OF AP FOREST ACT
అటవీ శాఖ వారు నమోదు చేసిన కేసు ల వివరములు :
9.POR.NO 40/19 ,1999 సం,, లో మంథని రేంజ్
10.POR.NO 40/42, 2001 సం ,, లో మంథని రేంజ్
11.POR.NO 101/10, 2001 సం ,, లో మంథని రేంజ్
12.POR.NO 45/182, 2002 సం ,, లో మంథని రేంజ్
ఎడ్ల శ్రీను అక్రమ కలప రవాణా వలన ఎక్కువగా అటవీ నరకబడిన ప్రాంతాలు :
మంథని రిజర్వేడ్ ఫారెస్ట్ లోని మహదేవపూర్ ,దామెరకుంట,ఆరెంద,గూడూర్,అడవి ముత్తారం ఖానాపూర్,రాపల్లి కోట ,వీరాపూర్ ,అంబటి పల్లి ,బొమ్మాపూర్ ,సర్వాయిపేట మహారాష్ట్ర లోని నడికూడా,అసేరేల్లి , చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని తాళ్ళగూడ, .ప్రాంతాలు ,
నేరం చేయు విధానం:
కలప స్మగ్లింగ్ కోసం మూడు టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ టీం ల కు ముందుగానే పెట్టుబడి కోసం డబ్బులిచ్చి మొదటి టీం లో అడవికి వెళ్లి చెట్లను నరికె వారుంటారు వీరికి చెట్ల లెక్కల డబ్బులు ఇస్తాడు. రెండో టీం లో నరికిన చెట్లను మైదాన ప్రాంతానికి తరలించేవారు వుంటారు. వీరికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఇస్తాడు మూడో టీం లో మైదాన ప్రాంతం నుండి పట్టణాలకు తీసుకేల్లెవాళ్ళు వుంటారు. వీళ్ళకు లక్షల్లో డబ్బులు ముడతాయి.
మొదటి బృందం ముందుగా తాము ఎంచుకున్న అటవీ ప్రాంతానికి వెళ్లి టేకు చేట్లను నరకడం జరుగుతుంది. అందులో 25 నుండి 30 మంది సబ్యులు వుంటారు. వీరికి రక్షణగా మరో 10 మంది వుంటారు. అందరు కూడా చెట్లు కోసే యంత్రాలు, గొడ్డళ్ళు, ఇతర మారణాయుధాలు కలిగి వుంటారు.
ఈ టేక్ కలపను ఎడ్ల బండ్ల పై వేసుకొని మైదాన ప్రాంతాలకు తరలించడం రెండో టీం పని. ఒకే సారి 10 నుండి 20 బండ్లు వరుస క్రమములో వెళ్తుంటాయి.
మైదాన ప్రాంతం నుండి కలపను వాహనాలలోకి ఎక్కించి నిర్దేశిత పట్టణాలు, ఇళ్ళ వద్దకి సరఫరా చేసేడి మూడో టీం. లారీలు, డీసిఎం వ్యాన్ లు, ట్రాలీ ఆటో లు, టాటా సుమో లు, వంటి వాహనాలను రవాణాకి ఉపయోగిస్తారు.. అటవీ ప్రాంతం నుంచి వెళ్ళే సరికి అయిదు, ఆరు సార్లు నెంబర్ ప్లేట్స్ మారుస్తారు. ఈ వాహనాలకి ఎస్కార్ట్ గా మూడు లేక నాలుగు బైక్ లు ముందుగా వెళ్తుంటాయి. ఒకవేళ పోలీస్, అటవీ శాఖ వారు కనిపిస్తే వెంటనే ఆ డ్రైవర్స్ ను అప్రమత్తం చేస్తారు. దీనితో డ్రైవర్ వెంటనే ప్రదాన రహదారికి పక్కనే వున్న గ్రామం వద్దకు తీసుకెళ్ళి టైర్ లు విప్పి వాహనం పాడైనట్లుగా ప్రవర్తిస్తారు. తరువాత రోడ్డు క్లియర్ గా వుందని సమాచారం రాగానే లారీ ని అనుకున్న ప్లేస్ కి తరలిస్తారు.
మహారాష్ట, చత్తీస్ఘడ్ రాష్టాలలో చెట్లను నరికించి ఆ కలపను గోదావరి దాటించే పనులను ఆ రాష్టాలకు చెందిన స్థానికులకు అప్పగిస్తారు. వారు కలప దుంగలను గోదావరి నదిలో పడవేస్తే వాటిని మరికొందరు తాళ్ళతో కట్టి ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు కు తరలిస్తారు. ఇక్కడికి రాగానే కలప దుంగలను చిన్న చిన్న ముక్కలుగా కోసి అనుకున్న ప్రాంతానికి తరలిస్తారు.

కలప రవాణాకు ఉపయోగేంచే ఎడ్ల బండ్ల వివరములు & ముందస్తు సమాచారం అందించు (ఎస్కార్ట్) వ్యక్తుల వివరములు :
ఎడ్ల శ్రీను కలప అక్రమ రవాణా మొదట అటవీ ప్రాంతాలనుండి ఎడ్ల బండ్ల ద్వార మైదాన ప్రాంతాలకు తీసుకు రావడం జరుగుతుంది .మొదట మహాదేవపూర్ ప్రాంతం లోని సర్వాయిపేట్ ప్రాంతం నుండి ఎడ్ల బండ్ల ద్వారా దామెరకుంట గ్రామానికి రవాణా చేస్తారు మరల ఆ గ్రామం నుండి వేరే ఎడ్ల బండ్ల ద్వారా అరెందా ,ఖానాపూర్ గ్రామాల మీదుగా విలోచానవరం గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది.ఈ విధంగా అక్రమ రవాణాకు ఉపయోగించే ఎడ్ల బండ్లు సుమారుగా మొత్తం 2000 వేలు ఉంటై అని అంచనా .ప్రస్తుతం పోలీస్ విచారణలో ఖానాపూర్ ,ఖాన్సాయి పేట్.ఆరెంద ,గూడూరు,ఎంకపల్లి ,రాపల్లి కోట ,వీరాపురం,గంగారం,సూరారం, సర్వాయిపేట్,అంబటి పల్లి,కొత్తపల్లి గ్రామాలలో ఈ అక్రమ రవాణాకు ఎడ్ల బండ్ల ద్వార సహకరించే సుమారు 50 మంది వ్యక్తులను గుర్తించడం జరిగింది.
పైలెట్ వ్యవస్థ ద్వార ముందస్తు సమాచారం అందించు పద్ధతి :
ఈ పైలెట్ వ్యవస్థ ద్వార కొంత మంది బైక్ లపై వెళ్తూ వెనుక వస్తున్నా ఎడ్ల బండ్ల పై అక్రమ రవాణా చేయు వ్యక్తులకు కంటే సుమారు 1 నుండి 2 కిలోమీటర్ దూరంలో ముందు ప్రయాణిస్తూ పోలీస్ ,అటవీ శాఖ అధికారుల కదలికల సమచారం అందిస్తూ కలప అనుకున్న ప్రాంతానికి తరలించడానికి సహకరం అందిస్తారు .ఒక వేళ పోలీస్ ,అటవీ శాఖ అధికారుల కదలికలు ఉంటే వెంటనే ముందస్తు సమాచారం అందించి ఆ మార్గంలో వచ్చే ఎడ్ల బండ్లను ఎవ్వరికి కనిపించకుండా అడవిలో దాచడానికి సహకరిస్తారు.
ఎడ్ల బండ్లకు పైలేటింగ్ చేసే వ్యక్తుల వివరములు మరియు వారు పైలేటింగ్ చేసే పరిది :
1.కనగంటి ఓదెలు ,R/o ఖానాపూర్ …… ఖాన్సాయి పేట్ గ్రామం నుండి మంథని వరకు
2.రాంశేట్టి అంజనేయులు @ అంజి, R/o దామెర కుంట —దామెరకుంట నుండి ఆరెందా వరకు
3. బుద్దర్తి శ్రీనివాస్ R/o మంథని ,…….మంథని నుండి విలోచనవరం
4.బక్కన్న @ రాజ స్వామి R/o దామెరకుంట, …..గూడూర్ నుండి దామెరకుంట వరకు
5.శేఖర్ R/o బొమ్మాపూర్ ,….మహదేవపూర్ ఏరియా
6.పర్సనేన ఐలయ్య R/o రాపల్లి కోట ,….మహాదేవపూర్ ఏరియా
వాహనాలలో కలప లోడ్ చేయు విధానం & వారి వివరములు :
2015 సం,, ముందు ….
మంథని,మహాదేవపూర్ అటవి ప్రాంతం నుండి ఎడ్ల బండ్ల ద్వార తీసుకు వచ్చిన అక్రమ కలపను పోతారం గ్రామం శివారులలో లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేసి అక్కడ నుండి వివిధ వాహనాల ద్వార సామిల్స్ కి ,పట్టణాలకు మరియు ఇతర రాష్ట్రాలకు రవాణ చేసి అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించి తన నేర కార్యకలాపాలను మహారాష్ట్ర ,చతిష్ ఘడ్ రాష్ట్రాలకు విస్తరించాడు .
2015 సం,, తరువాత ……
మంథని,మహాదేవపూర్,మహారాష్ట్ర ,చతిష్ఘడ్ అటవీ ప్రాంతం నుండి ఎడ్ల బండ్ల ద్వార తీసుకు వచ్చిన అక్రమ కలపను పోతారం గ్రామం శివారులలో లోడింగ్ పాయింట్ ఏర్పాటు అటవీ,పోలీస్ శాఖ వారికీ తెలిసి పోవడంతో పట్టుకుంటారు అనే భయంతో అక్కడ నుండి విలోచానవరం గ్రామ శివారులోని పోచమ్మ గుడి ప్రాంతంలో మరొక లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేసి 16 మందితో కూడిన ఒక లోడింగ్ పార్టీని ఏర్పాటు చేసి వారితో అనుకున్న ప్రాంతాలకు లోడ్ చేపించి అక్కడ నుండి ఇక్కడ నుండి పెద్ద మొత్తంలో కలప రవాణా కొనసాగిస్తున్నాడు
వాహనాలకు పైలేటింగ్ పద్ధతి :
లోడింగ్ చేసిన లారీలు, డీసిఎం వ్యాన్ లు,టాటా సుమో,బొలెరో లు వంటి వాహనాలను రవాణాకి ఉపయోగిస్తారు..ఈ ప్రాంతం నుంచి అనుకున్న ప్రాంతానికి వెళ్ళే సరికి అయిదు, ఆరు సార్లు నెంబర్ ప్లేట్స్ మారుస్తారు. ఈ వాహనాలకి పైలెట్ గా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా వెళ్తుంటారు . ఒకవేళ పోలీస్, అటవీ శాఖ వారు కనిపిస్తే వెంటనే ఆ వాహనంలో ఉన్న తమ వ్యక్తిని అప్రమత్తం చేస్తారు. దీనితో డ్రైవర్ వెంటనే ప్రధాన రహదారికి పక్కనే వాహనం ఆపి పాడైనట్లుగా ప్రవర్తిస్తారు. తరువాత రోడ్డు క్లియర్ గా వుందని సమాచారం రాగానే లారీ ని అనుకున్న ప్రాంతానికి తరలిస్తారు.
అక్రమ టేకు కలప దిగుమతి చేసుకోను సామిల్స్ వివరములు :
గత కొన్ని సంవత్సరాలుగా ఎడ్ల శ్రీను కొంతమంది కలప డిపో వ్యాపారస్తులకు వారి వ్యాపార అవసరాలకు కలప అక్రమ రవాణా చేయడమే కాకుండా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సుమారు (10 ) సామిల్స్ కి అక్రమంగా రవాణా చేయుచున్నాడు.ముఖ్యంగా ఈ దిగువ తెలిపిన సామిల్స్ కి అధికంగా అక్రమ కలప రవాణా చేయడం జరుగుతుంది .
1.సాయిరాం సామిల్స్, గోదావరిఖని
2. శ్రీ బాలాజీ సామిల్స్ , గోదావరిఖని
3. శనిగ నారాయణ రెడ్డి సామిల్ ఎర్రగుంటపాలెం ,ప్రకాశం జిల్లా
అక్రమ టేకు కలప రవాణా మార్గాలు :
మంచిర్యాల, మంథని, చెన్నూర్, భూపాలపల్లి ప్రాంతాలలో టేకు కలపను టార్గెట్ చేసిన ఎడ్ల శ్రీను ఈ ప్రాంతాలలో టేకు అంతర్ద్దానం అవుతుండడం తో మహారాష్ట చత్తీస్ఘడ్, గోదావరి అవతల వున్న ప్రాంతాలను టార్గెట్ చేయడం జరిగింది. చత్తీస్ఘడ్ లోని బద్రకాళీ అటవీ ప్రాంతాల వరకు ఇతని గ్యాంగ్ వలన అడవులు అంతరించి పోయాయి. బద్రకాళీ, మిగతా ప్రాంతాలలో వున్నా అటవీ ప్రాంతాన్ని ట్రీ కట్టర్స్ తో నరికి ఎడ్ల బండ్ల ద్వారా తిరునాళ్ళకి, జాతరకు వచ్చినట్లు బండ్లపై కలప వేసుకొని రవాణా చేయడం.
అటవీ & పోలీస్, శాఖ అధికారుల అండదండలతో టేకు కలప అక్రమ రవాణా దందా :
20 సం.. లుగా యదేచ్చగా కలప స్మగ్లింగ్ సామ్రాజ్యం నడిపించడానికి బేస్ క్యాంపు వాచర్ నుండి DFO వరకు అండదండలు కలవు రాజకీయ నాయకుల ఒత్తిడి వాళ్ళ గాని లేక అతని చూపించిన డబ్బు ఆశతో కొంత మంది అధికారులు ఎడ్ల శ్రీనుకి పరోక్షంగా, ప్తత్యక్షంగా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. అనేక మంది అధికారులు వారి గృహ నిర్మానాలకి నకిలీ వే బిల్లులతో కలప స్మగ్లింగ్ చేయడం తో పాటు ఎవరెవరికి ఎంత మాముల్లు ఇచ్చాదనేది ఫోన్ కాల్ డేటా మరియు ఇతర ఆధారాలతో వివరాలు సేకరించడం జరిగింది. ఇంకా కూలంకషంగా వారి వివరాలు ఆదారాలతో సేకరించి సమగ్ర రిపోర్ట్ ద్వారా పోలీస్,అటవీ ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి అందించటానికి రామగుండం పోలీస్ శాఖ సమాయత్తమైంది.
కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల అండదండలు మరియు పలుకుబడి……:
20 సం.. ల క్రితం ప్రారంభమైన కలప అక్రమ రవాణా జీవితం అనది కాలంలోనే కొంతమంది రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో అతనిపై కేసులు నమోదు కాకుండా, కలప అక్రమ స్మగ్లింగ్ కి అంతరాయం కలగకుండా ఉండేందుకు రాజకీయ నాయకులకు సహకరిస్తూ, రాజకీయంగా వారికి ఎన్నికలలో ఉపయోగపడడంతో ఎడ్ల శ్రీను కి సర్పంచ్ నుండి MLA వరకు అండగా నిలిచారు. ఇతని రాజకీయ పలుకుబడి ఎంత వరకు వెళ్లిందంటే రాజకీయ నాయకుల గెలుపు, ఓటములు తేల్చే వరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొన్ని గ్రామాలలో తన పలుకు బడితో, తన స్మగ్లింగ్ అనుచర గనంతో ఎన్నికల్లో ప్రభావితం చేసినట్టు దర్యాప్తులో తేలింది.
ప్రభావిత గ్రామాల పేర్లు:
వెంకపల్లి, రాపల్లి కోట, అంబటి పల్లి, సూరారం, బొమ్మాపూర్, వీరాపూర్, గూడూర్, ఉడుపులవంచ, గుమ్మాలపల్లి, దామెరకుంట, గంగారం, విలాసాగర్, ఇప్పలపల్లి, ఆరెంద, వెంకటాపూర్, నాగేపల్లి, కాన్సాయిపేట, ఖానాపూర్, విలోచావరం, పోతారం, మల్లేపల్లి, గుంజపడుగు, …….etc
అరెస్ట్ చేసిన నిందితుల వివరములు :
1. ఎడ్ల శ్రీను s/o లేట్ రాజయ్య ,పోతారం , మంథని
2. కుడేదల కిషన్ s/o ఖాన్ సాయి పెట్ ,మంథని
3. కోరవేని మధుకర్ s/o సత్తయ్య విలోచావరం
4. రాగం శ్రీనివాస్ s/0 .సాంబయ్య ,విలోచవరం
5. ఎడ్ల సంతోష్ s/o మల్లయ్య ,లద్నాపూర్
ఎడ్ల శ్రీను కలప స్మగ్లింగ్ లో సహకరించే సహానిందితుల వివరములు :
1. దేవరకొండ మహేందర్ ,విలోచవరం
2. బుద్దర్తి సదానందం , విలోచవరం
3. మీసాల బాపు , విలోచవరం
4. పోగుల శంకర్ , విలోచవరం
5. కోరవేని రవి , విలోచవరం
6. మీసాల నరేష్, విలోచవరం
7. మీసాల సత్తయ్య , విలోచవరం
8. బండ సతీష్ విలోచవరం
9. అంజి ,విలోచవరం
10. దేవరకొండ రాయమల్లు, విలోచవరం
11. జగేటి శంకర్, విలోచవరం
12. రాంశెట్టి అంజనేయులు @ అంజి , విలోచవరం
13. బక్కన్న @ రాజస్వామి, దామెరకుంట
14. శేఖర్, బొమ్మాపూర్
15. పర్సవేన ఐలయ్య,రాపల్లి కోట
16. ధర్మారెడ్డి ,సాయిరాం సామిల్స్,గోదావరిఖని
17. కాసిపేట శివాజీ ,బాలాజీ సామిల్,గోదావరిఖని
18. శనిగ నారాయణ రెడ్డి ,ఎర్రగొండ పాలెం
స్వాధీన పరుచుకున్న వాహనాలు మరియు కలప వివరములు :
1.స్కార్పియో నెంబర్ AP 15 AD 8619
2.టేకు దుంగలు (10)
మూడనమ్మకాల (క్షుద్ర పూజలు ) ప్రభావం :
అక్రమ కలప సామ్రాజ్యం 20 సం.. లుగా నడిపిస్తున్న ఎడ్ల శ్రీనుకి ఒక విచిత్రమైన నమ్మకం వుంది. అది ముదనమ్మకాల ప్రబావం ఉంటుందని నమ్మడం. మంథని, భూపాలపల్లి ప్రాంతాలలో సుపరిచితుడైన ఎడ్ల శ్రీను కి కలప స్మగ్లర్ గా దిష్టి తగులుతుందని సమీప బందువులు చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారని కొంతమంది పూజారులు అతనిని నమ్మించి అతని వద్ద నుండి అధిక మొత్తం లో డబ్బులను దండుకోవడం జరిగింది. అదేవిదంగా క్షుద్ర పూజలు చేయడం వలన పోలీస్, అటవీ శాఖ వారి నుండి ఇటువంటి ప్రమాదం ఉండదని నమ్మించి సుమారు 12 మంది వివిధ ప్రాంతాల పూజారులు కొన్ని లక్షల రూపాయలు అతని వద్ద నుండి డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. మరియు వారిలో ముఖ్యంగా
1. చల్లా నరసింహా @ సహదేవరాజు, వరంగల్
2. తుర్పాటి సమ్మయ్య, గోదావరిఖని
3. పాస్తం పెద్దబాబు, దంతాలపల్లి
4. కొండా వెంకయ్య, మందమర్రి
5. సౌత్కారి సాలయ్య, పోతారం
వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ను ఏర్పాటు చేయడం జరిగింది.

అక్రమ స్థావరాలు గుర్తింపు కోసం డ్రోన్ కెమరా :
సాంకేతిక పద్ధతిఐన జియో ట్యాగ్గింగ్, డ్రోన్ కెమరా ద్వారా గోదావరి ప్రాంతలో ఇసుక లో దాచిన టేకు దుంగల ఆనవాళ్ళు గుర్తించి పట్టుకోవడం జరిగింది . విరి కలప నిల్వ స్థావరాలు,రవాణా మార్గాలను జియో ట్యాగ్గింగ్ చేసి తద్వారా వీరిపై నిరంతర నిఘా పెట్టడం జరిగింది.
ఇంకా దర్యాప్తు చాలా ఉంది :
కలప స్మగ్లింగ్ సంబంధించి నేరస్తులలో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది .ఈ రోజు ప్రధాన నిందితులు 5 గురుని అరెస్ట్ చేయడం జరిగింది .వీరితో పాటు అక్రమ కలప రవాణా కేసులలో ఇంకా సుమారుగా 20 మంది ని త్వరలో అరెస్ట్ చేయడానికి జాబితా సిద్దం చేశాం ,అదేవిధంగా కలప అక్రమ రవాణా సామ్రాజ్యం సంబందించిన పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతుంది .
వాతావరణ సమతుల్యత ……..
పచ్చని అడవులను రక్షించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్దకం అని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ౩౩ శాతం ఉండాల్సిన అడవులు 24 శాతానికి పడిపోయాయని, ఇలాగే వుంటే రాబోయే రోజుల్లో రాష్టంలో పచ్చదనం మరింత తగ్గుతుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.భవిష్యత్తు మానవ మనుగడకి ముంపు తేచ్చే కలప స్మగ్లింగ్ చేసేవారు ఎంతటివారైన ఉపేక్షించేది లేదు వారిపై కఠిన చర్యలు నాన్ బెయిల బుల్ సెక్షన్లు తోపాటు పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది . ఎడ్ల శ్రీను మరియు కొంతమంది వ్యక్తులపై త్వరలోనే పిడి ఆక్ట్ అమలు చేయడం జరుగుతుందని సిపి  తెలిపారు..ఎడ్ల శ్రీను ,అతని ప్రధాన అనుచరులను పట్టుకోవడంలో కృషి చేసినా అధికారులను ,సిబ్బందిని సిపి  అభినందించారు..

న్యూస్ from:- తెలంగాణ రిపోర్టర్-దినేష్..✍9394328296