కాంగ్రెస్ కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు..

www.telaganareporter.news✍9394328296

  కాంగ్రెస్ కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు..

IMG-20180824-WA0039
👉రామగుండం కార్పొరేషన్ ప్లోర్ లీడర్లు గా ఫీచర శ్రీనివాస్, బొమ్మక శైలజ..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఆగస్టు-24, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-
రామగుండం మేయర్ అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు స్థానిక టిఆర్ఎస్ పార్టీతో కుమ్మకై మేయర్ ఆవిశ్వానికి కారణమైన 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్ల కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) షోకాజ్ నోటీస్ జారీ చేసింది..ఈ నెల 2 న జరిగిన అవిశ్వాసం లో టిఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ను గద్దె దించేలా చేశారని, కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా ఇక్కడి కాంగ్రెసు కార్పొరేటర్లు 8 మంది మూకుమ్మడిగా అవిశ్వాస సమావేశంలో టిఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికిన తీరుపై, పార్టీ ని ధిక్కరించిన విషయంలో పార్టీ వీరిపై క్రమశిక్షణ లో భాగంగా టీపీసీసీ పారి క్రమశిక్షణ విభాగ ఛైర్మన్ యం. కోదండరెడ్డి షోకాజ్ నోటీస్ జారిచేసినట్లు రామగుండం కాంగ్రెస్ నేతలు తెలిపారు.. పార్టీ ఇచ్చిన షోకాజ్ కు వారి వివరణ ఇవ్వాలని లేదంటే వారిపై గైడ్ లైన్స్ ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

👉రామగుండం డిప్యూటీ ప్లోర్ లీడర్లుగా ఇద్దరు.

IMG-20180824-WA0040

రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్ల మొదటి ప్రతినిది (ప్లోర్ లీడర్) ఫీచర శ్రీనివాస్, డిప్యూటీ ప్లోర్ లిడర్ గా బొమ్మక శైలజ లను రామగుండం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాల్వ లింగుస్వామి అధికారిక పత్రాన్ని అందించారు. ఇన్ని రోజులుగా ప్లోర్ లీడర్లు గా వ్యవహరించిన మహంకాళి స్వామి, బొంతల రాజేష్ లను తొలగించి ప్లోర్ లీడర్లుగా ఫీచర శ్రీనివాస్, బొమ్మక శైలజ లకు నియామక పత్రం అందచేశారు..

IMG-20180825-WA0001

వీరి నియామకానికి కృషి చేసిన కాంగ్రెస్ అధినేత దుద్దిల్ల శ్రీధర్ బాబు, బడికెల రాయలింగం, గుమ్మడి కుమారస్వామి, బొంతల రాజేష్, వంగశ్రీనివాస్ గౌడ, మాదరబోయిన రవికుమార్లతో పాటు ఎన్ ఎస్ యుఐ లకు ధన్యవాదాలు తెలిపారు..