కుంభమేళాలో స్నానం చేసినంత ఆనందంగా ఉంది: నరెంద్ర మోడి

ssssGujarath, Ahmedabad, April23:9849162111


 

భారత లోకసభ ఎన్నికల పర్వంలో మూడోదశ పోలింగ్ ప్రారంభమైంది..

IMG_20190423_083441

ఈ నేపథ్యంలో…గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన ఓటు హక్కును రానిప్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు.

IMG_20190423_075323

మోడి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుగా తన తల్లి వద్దకు వెళ్ళి, ఆనవాయితీ గా ఆశీర్వాదము తీసుకున్నారు. ఆమె స్వీట్ ను తినిపించగా, మోడి తన తల్లికి సైతం తీపిని తినిపించారు.

అనంతరం తల్లి ఇచ్చిన ఆశీస్సుల దుపట్టా చేతబూని , బయటకు వచ్చారు.
బయట ఉన్న బంధువులను కలుసుకుని పలక రించి, పిల్లలతో ఫోటోలు దిగారు.
అక్కడే వీధిలో నిలుచున్న వారివైపు వెళ్లి అభివాదం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం…పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చారు. తాను ఓటువేసి, సిరాచుక్క ఉన్న వేలును అక్కడి ప్రజలకు చూపిస్తూ, ఉత్సాహంగా కాలినడకన అమిత్ షా తో కలిసి కొంత దూరం నడిచారు.

అనంతరం ఓపెన్ టాప్ జీపునుండి మీడియా తో మాట్లాడారు.

ఓటు వేయడాన్ని ఉత్సవంలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటు వేయడం కుంభమేళాలో స్నానం చేసినంత ఆనందంగా ఉందన్నారు.

కుంభమేళాలో గంగా స్నానం చేసినంత ఆనందం…ఈ రోజు నేను ఓటు వేయడంలో అంతే ఆనందం కలిగిందన్నారు….ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం లాంటిదనీ…మొట్ట మొదటి సారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేయడానికి కదిలిరావాలి….మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు.ఓటరు ఐడి అనేది గొప్పది…ఓటు వేయడాన్ని ఒక ఉత్సవంలా జరుపుకోవాలి..పండగ వాతావరణం లో ఉన్నట్టుగాఓటు వేయాలన్నారు.

ఒక ఓటరుగా బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకున్నాను…. ఓటరు ఐడి అనేది ఐఈడి కన్నా గొప్పదన్నారు.