కౌన్సిలర్ పై హత్యాయత్నం కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్: సిఐ ప్రకాష్

జగిత్యాల జిల్లా: ఏప్రిల్ 20: తెలంగాణ రిపోర్టర్, gangareddy ch


జిల్లా కేంద్రంలో గత 16న రాత్రి 11 గంటల ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ పై హత్యా యత్నం సంఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టౌన్ సిఐ ప్రకాష్ తెలిపారు.
IMG-20190420-WA0597
గత కొంతకాలం నుండి రాజకీయ కక్ష్యలతో అనుమల్ల శ్రీనివాస్ పై ద్వేషం పెంచుకున్న బోగోజి ముఖేష్  ఖన్నా, పల్లెర్ల మధు, గొల్లపల్లి రవికుమార్, జటంగుల రాజేందర్ అనే నలుగురు వ్యక్తులు శ్రీనుపై తమతో తెచ్చుకున్న కత్తులతో దాడి చేసి, బండతో తలపై మోదడంతో, తలపై, పొట్టపై గాయాలయ్యాయని సిఐ ప్రకాష్ వివరించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల అప్రమత్తతతో ప్రాణాపాయం నుండి బయటపడి చికిత్స పొందుతున్నాడని తెలిపారు.ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.కాగా, ఈ నలుగురు వ్యక్తులపై రౌడిషీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు.