“ఖనిలో”కాంగ్రెస్ బస్సు యాత్ర ,బహిరంగ సభ సక్సెస్..

IMG-20180401-WA0106www.telaganareporter.news✍9394328296

*”ఖనిలో”కాంగ్రెస్ బస్సు యాత్ర ,బహిరంగ సభ సక్సెస్..

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తద్యం..
కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలకు ఇక్కట్లు..

IMG-20180401-WA0116

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఏప్రిల్-1,తెలంగాణ రిపోర్టర్(దినేష్):

👉కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతికంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెండో విడత బస్సు యాత్ర కార్యక్రమం ఆదివారం రామగుండం నియోజకవర్గంలో నిర్వహించారు..
అనంతరం గోదావరిఖనిలో ని ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ లో సాయంత్రం 7 గంటలకు బహిరంగ సభ జరిగింది..

IMG-20180401-WA0110
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ కుంతియా, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, శాసన సభ పక్ష నేత జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, హరుకాల వేణుగోపాల్ రావు, మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, నేరేళ్ల శారద, ఐ ఎన్ టి యుసి నాయకులు జనక్ ప్రసాద్, మాజీ షాప్ చైర్మన్ మక్కన్ సింగ్ తో పాటు రాష్ట్ర, కేంద్ర నాయకులతో పాటు రామగుండం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు..

👉జిల్లా అధ్యక్షులు మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి కుంతియా, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడారు…

IMG-20180401-WA0111

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం లో గెలిపించుకొంటామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు..
టిఆర్ ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండ గట్టడానికే  కోల్ బెల్ట్ ప్రాంతంపై దృష్టి సారించి, బస్సు యాత్ర కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ ఎస్ ప్రభుత్వం పారిశ్రామికంగా,ఉపాధి, ఉద్యోగ పరంగా కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రతో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వచ్చామన్నారు..
రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ బంగారు కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించ్చారు..
ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించిన టిఆర్ ఎస్ ప్రభుత్వం, గెలిచాక వాటి పరిస్కారo లో విఫలం అయ్యారని హెద్దే వ చేశారు..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం ఖాయం అన్నారు.

IMG-20180401-WA0117
ఈ సభలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, అభిమానoతో ఉన్న పలువురి శ్రేణులను పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుమ్మడి కుమారస్వామి, గంట సత్యనారాయణ రెడ్డి, బడికెల రాజలింగం, కాల్వ లింగ స్వామి, మాహాకాలి స్వామి, సుజాత, బొమ్మక శైలజ,బొంతల రాజేష్, పెద్దెల్లి ప్రకాష్, తానిపార్టీ గోపాలరావు,తిప్పారపు శ్రీను, ముస్తఫా, రవి కుమార్, డొంతుల లింగం, గాధం నందు, విజయ, ప్రసన్న కుమార్, మహేష్,పీక అరుణ్ కుమార్,ఓదెలు యాదవ్,  తదితరులు పాల్గొన్నారు..