గుండె నొప్పి తో ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కన్నుమూత…

దుబాయ్:

sridevi.jpg1

ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ కపూర్‌తో కలిసి ఆమె దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆమెకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది.

హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆమె కన్నుమూసినట్లు తెలిపారు. దడాక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. విషయం తెలియడంతో శ్రీదేవి బంధువులు, సన్నిహితులు, మిత్రులు, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకున్నారు.శ్రీదేవి అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు. ఈ విషయాన్ని సంజయ్ కపూర్ ధ్రవీకరించారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్ర సీమలను ఆమె కొన్నేళ్ల పాటు ఏలారు. హఠాత్తుగా ఆమె మృతి చెందడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు.

శ్రీదేవి 13 ఆగస్టు 1963లో జన్మించారు. బాలనటిగా 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు.

1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

ఇప్పటి వరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది….