గూగుల్ ప్లస్‌ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ నిలిపివేయనున్న గూగుల్

 

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ ప్లస్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ సేవలను నిలిపివేయనుంది.

google-plus

2019 ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లస్ ఇక యూజర్లకు అందుబాటులో ఉండదు. గూగుల్ ప్లస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఏపీఐలో బగ్స్ ఉన్నందున 52.5 మిలియన్ల గూగుల్ ప్లస్ యూజర్ల సమాచారం చోరీకి గురైందని గూగుల్ గుర్తించింది. గూగుల్ ప్లస్ యూజర్లకు చెందిన పేర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు, వృత్తి, వయస్సు తదితర వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లి ఉంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ తన గూగుల్ ప్లస్ యూజర్లకు ఈ విషయంపై నోటిఫికేషన్లను కూడా పంపుతున్నది. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం వల్లే ఇలా జరిగిందని గూగుల్ గుర్తించగా, మరో 90 రోజుల్లో మొత్తం గూగుల్ ప్లస్ ఏపీఐలను గూగుల్ నిలిపివేయనుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2019 నుంచి గూగుల్ ప్లస్ సేవలను గూగుల్ నిలిపివేయనుంది.