చరిత్ర అంటే మన కథే అని చెప్పిన జైశెట్టి రమణయ్య……

www.telanganareporter.news  sicilla srinivaS 9849162111

chv Prabhakar-Rao1చరిత్ర అంటే మన కథే అని చెప్పిన జైశెట్టి రమణయ్య……

సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్  జర్నలిస్ట్….

Email: chvprabhakarrao@mail.com  9391533339

  • మనిషి తన గురించి తాను చెప్పుకోవాలంటే ముందు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదవాలి.

IMG_20180329_203014

  • తన చుట్టూ ఉండే మనుషులు, అందులో తన వారు, స్నేహితులు, రక్త సంబందీకులు ఇలా అనేకులంతా కలిసి సమాజం అవుతుంది.
  • ఆ సమాజంలో ఉన్న మనను గురించి రాసిందే సమాజ చరిత్ర. ఆదిలో తన జీవితంలోజరిగిన సంఘటనలను, అందులో తన పాత్రను, తన స్పందనలను, తన ప్రవర్తనను, తన పట్ల సమాజంలోని ఇతర మనుషుల స్పందనను, తను చేపట్టిన కార్యక్రమాలను వివరించేదే ఆ వ్యక్తి ఆత్మకథ….సొంత ఎదుగుదల

IMG_20180329_205342

ఈ క్షణం మరో క్షణంలో గతం అవుతుంది. ఆ గతమే మన చరిత్ర. మన గతాన్ని మనం నేమరువేసుకోవడం, అక్షర రూపం ఇవ్వడమే చరిత్ర.

అందరు జీవిస్తారు. అందరి జీవితాలు చరిత్రలో భాగమే.కాని కొంతమంది జీవిత విశేషాలే చరిత్రగా మిగతా  అందరు చదువుతారు. అదే చరిత్ర. ఆ మనిషి యొక్క మహనీయత. ఇలా ఒక మనిషి, ఒక సమూహం, ప్రాంతం, దేశం, రాజ్యం లోని మనుషుల చరిత్రనే మన చరిత్రగా చెప్పుకొంటాము.

పుంభావ సరస్వతి-ఉపన్యాసకేసరి :

(డా.జైశెట్టి ర్మణయ్యను శాలువా కప్పి సన్మానిస్తున్న సీనియర్ పాత్రికేయులు సిహెచ్.వి.ప్రభాకర్ రావు, సిరిసిల్ల శ్రీనివాస్...)
(డా.జైశెట్టి రమణయ్యను శాలువా కప్పి సన్మానిస్తున్న సీనియర్ పాత్రికేయులు సిహెచ్.వి.ప్రభాకర్ రావు, సిరిసిల్ల శ్రీనివాస్…)

అలాంటిదే మన దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మన ఊర్లో మనతోపాటు ఎదిగిన మహా మనీషి, జ్ఞాన భాండాగారం, స్నేహశీలి, అందరికి ఆదర్శప్రాయుడు, ఉపన్యాసకేసరి, మితృడు, ఆత్మీయుడు అయిన  తరువాతే చరిత్రకారుడు  అయిన జైశెట్టి రమణయ్య జీవితం తెరిచిన పుస్తకం.

ఆయన తనకొరకు జీవిస్తున్నట్లు  కనబడినా, తన చుట్టూ ఉన్న తన కుటుంబoతో ఉంటూనే, తనకు ఉనికిని, గుర్తింపు నిచ్చే సమాజం పట్ల నిబద్దతతో, సమాజానికి ఎదో చేయాలనే తపన కలిగిన, తనవంతు శ్రమతో, తనవారితో పాటు సమాజంలోని అందరికి తన జ్ఞానాన్ని, శారీరక శ్రమను, మేధస్సును పంచిన అపర సరస్వతి పుత్రుడు రమణయ్య.

నిజానికి ఆయన పుస్తకాలలో చదివిన దానికన్నా తన తోటి మనుషులను, సమాజాన్ని క్షుణ్ణంగా చదివిన మహనీయుడు.  ప్రతిక్షణం తన కుటుంబాన్ని, కుటుంబ బాధ్యతలను మోస్తూనే తన వ్యక్తిగత అవసరాలను తీర్చుకొంటూనే, ఈ సమాజం పట్ల ఒక గురువుకు ఉండాల్సిన బాద్యతలనేరంగి, సమాజంతో పాటు ముందుకు వెళ్ళిన ధీశాలి.

సమాజమే కుటుంబంగా జీవించిన మనీయుడు:

కుటుంబ పోషణకు ఉద్యోగం అవసరమే కావచ్చు కాని, ఆ ఉద్యోగంలో తన బాధ్యతనేరంగి, తనలోని జిజ్ఞాసకు, తపనకు అనుగుణంగా, తన వ్యక్తిత్వాన్ని, భౌతికమైన, ఉద్యోగానికి అవసరమైన విద్యను నేర్చుకొంటూ, ఇతరులకు నేర్పుతూ, నిజమైన నిత్య విద్యార్థిలా ఇప్పటికి పలువురికి, ఈ  80 ఏళ్ళ నిండు జీవితంలో నిరంతరం కృషి చేస్తున్న జైశెట్టి రమణయ్య ఈనాటి వ్యవస్థకు, గురువులకు, నాయకులకు, విద్యార్థులందరికీ మార్గదర్శి. నిజానికి ఆయన ఒక వ్యక్తిగా కంటే ఒక నిరతర శ్రమ శక్తిగా, ఒక వ్యవస్టగా, ఒక గురువుగా, ఒక స్నేహితునిగా మూడు తరాల జనానికి తన జ్ఞానాన్ని, సేవలను అందించిన నిజమైన నాయకుడు, గురువు….

జైశెట్టి రమణయ్య రాసిన తన “ సొంత ఎదుగుదల “ పుస్తకం ఆయన జీవితంలో జరిగిన సంఘటనల సమాహారం కాదు….

ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో,  ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో లక్ష పై చిలుకు జనాభా ఉన్న జగిత్యాల పట్టణం మిగతా అన్ని ఊర్లలానే ఒక అనామనక పట్టణం. కాని జగిత్యాల పట్టణంలో ఈనాటి జైశెట్టి రమణయ్యలాంటి మహానుభావులు జన్మించడం వలన  జగిత్యాల ఒక చైతన్యవంతమైన ఒకగొప్ప ప్రాంతంగా, కవి పండిత ప్రకాండులకు వేదికగా, జ్ఞాననిలయంగా మహనీయులు నడయాడిన పుణ్యభూమిగా దేశచరిత్రలో, కాదు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది.

నాకు తెలిసిన గత 48 సంవత్సారాల జగిత్యాలలో పురాణ ప్రవచనాలలో ప్రపంచ ప్రసిద్దిగాంచిన మందిరం చంద్రమౌళి శాస్త్రి, చెట్ల పెంపకంలో ప్రభుత్వ గౌరవాన్నిదశాబ్దాలక్రితమే అందుకొని, పేదవారి సేవలో గడిపిన మహనీయుడు తులిసి కిష్టయ్య, ప్రక్కనే ఉన్న కోరుట్లలోని శతావధాని క్రిష్ణమాచార్య్ల, ఆక్స్ శేషప్ప కవి, రామసింహ కవి లాంటి వారితో పాటు ఆతరువాతి తరంలోని బి ఎస్ రాములు, అలిశెట్టి ప్రభాకర్, కే వి నరేందర్ లాంటి కవులు రచయితలతో అలరారిoది. తరువాత దశలో ఆర్థికంగా ఎదగడంలో,  నూతన చైతన్యంలో భాగంగా ఉద్యమాల గడ్డగా పేరొందిన జగిత్యాల గ్రామాన్ని పట్టణ దశకు మార్చిన శ్రీరాంసాగర్  ప్రాజెక్ట్ తరువాత, రమణయ్య జగిత్యాల పట్టణానికి ఒక ప్రత్యెక గుర్తింపును తెచ్చారు.

జగిత్యాలకు “రమణయ్య సార్” అనే పేరు పర్యాయ పదం అయిందనడం అతిశయోక్తి కాదు. భారత,ఐరోపా దేశాల చరిత్రను క్రీస్తు పూర్వంనుండి ఈ నాటి మోడీ వరకు అనర్ఘలంగా, అతి సులువుగా, వినేవారి స్థాయికి అనుగుణంగా, ఎలాంటి పుస్తకం చూడకుండా, తత్తరపాటు లేకుండా గంటలపాటు ఆనాటి సంఘటనలకు దృశ్య రూపం ఇస్తున్నట్లు చెప్పగల ఆయన మోదో శక్తి, మాటల చాతుర్యం అయనను మేరునగదీరునిగా, గొప్ప చరిత్రకారునిగా చరిత్రలో ప్రత్యెక స్థానాన్ని ఇచ్చి నిలబెట్టింది.

ఇలాంటి ఆయన జ్ఞాపకాల దొంతరలోనుండి వచ్చిన “సొంత ఎదుగుదల” అయన సొంతంకాదు. ఇది జగిత్యాల పట్టణ ప్రాంత మనుషుల, కుటుంభాల సామాజిక జీవన చిత్రం. ఆయన పుట్టిన రోజుకంటే ముందు నుండే జగిత్యాల కేంద్రంగా చేసుకొని, ప్రపంచంలో తన ప్రమేయం లేకుండా జరిగిన అనేక విషయాలను, సంఘటనలను, సమస్యలను ఒక సామాజిక చరిత్రకారునిగా అందంగా, సులభశైలిలో చిత్రీకరించారు.

తెలుగు, ఉర్దూ,ఆంగ్ల భాషలో అనర్ఘలంగా మాట్లాడగల నిపుణత, ఆంగ్ల, తెలుగ భాషలలో సవ్యసాచిలా రాయగల ఆయన, గతంలో అనేక చరిత్ర పుస్తకాలను అవసరార్థం రాసినా, అయన తన జిజ్ఞాసతో,ఈ ప్రాంత చరిత్ర, దేవాలయాల చరిత్రను, సామాజిక అంశాలను, తాను  చూసిన, స్పందించిన, స్పందించని అనేక విషయాలను పుస్తక రూపాలో వెలువరించారు.

ఆయన ఇతరులలో  మంచిని మాత్రమే చూడగల, చూసి హంసలా వేరు చేసి వ్యక్తీకరించే గీటురాయి. రాష్ట్రంలో, జిల్లాలో, జగిత్యాల పట్టణంలో చుట్టూ ప్రక్కల అనేక వేల సభలలో ప్రసంగించిన మాహా వక్త.

తెలుగు పండితుడు కాకున్నా అంతకంటే ఎక్కువగా తెలుగు భాష పట్ల అభిమాన, ఆసక్తి ఉంది. తెలుగులో విశేషణాలతో, చతురోక్తులతో సభికులను ఆకట్టుకొనే ఆయన ప్రసంగాలు ఒక చరిత్రకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక అంశాలు, సమాజ సేవకు సంభందించిన అనేకం ఉన్నాయి.

గతంలో చరిత్ర అంటే తారీఖులు, రాజుల, రాణుల పేర్లు మాత్ర్రమే ఉండేవి. కాని చరిత్ర మన చుట్టూ ఉండే సమాజంలోని మనవారి జీవన గతులేననే సత్యాన్ని గ్రహించిన చరిత్రకారులు అన్నివర్గాల సమగ్ర సచారాన్ని క్రోడీకరించి రాస్తున్నదే నిజమైన చరిత్ర అన్న ఆధునిక యుగ చరిత్రకారుల మాటలకు నిజమైన రచనగా జైశెట్టి రమణయ్య “ సొంత  ఎదుగుదల”  రచనను పేర్కొనవచ్చు.

జైశెట్టి రమణయ్య రచన చదువుతున్నంతసేపు ఒక ఉమ్మడి కుటుంబపు జీవన విధానాన్ని తెరపై చూస్తున్నమా అనిపిస్తుంది. ఇంటికి పెద్దకొడుకు అంటే ఎన్ని బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందో ఈ తరం యువకులకు   తెలియజేప్పే అద్బుత రచన.

ఉమ్మడి కుటుంబ చరిత్ర:

తన జన్మ తేది జనవరి 23, 1914 నుండే  కాకుండా తన తాత, ప్రఖ్యాత కవి జైశెట్టి రాజయ్య  జీవిత విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపారు. ఆనాటి చదువులు, గురువుల నిబద్దత, పిల్లలపట్ల వారు తీసుకొన్న బాత్యలు, విద్యార్థులకు గురువుల పట్ల ఉండే సాన్నిహిత్యం, గౌరవాలను తెలుసుకొంతుంటే, నిజంగా ఇద మన కాలం నాటి పరిస్తితేనా అన్న అనుమానం కలుగుతుంది. తన సోదరుల మంచి చెడ్డలను తనవిగా స్వీకరించి, సోదరీమణుల వివాహ సమయటలలో తండ్రి కి తోడుగా నిలిచిన కొడుకు కథ ఇది. తన పెళ్లి తరువాత, తన పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కూడా తన తండ్రి భాద్యతలను మోస్తూ, తన నెలసరి వేతనం నుండి కొంత డబ్బును తండ్రికి ఇచ్చిన బాద్యతాయుతమైన కొడుకు చెప్పిన నిజాలు.

అన్ని పోరాటాలకు సమ ప్రాదాన్యం:-

స్వాతంత్ర పోరాటసమయంలో, రాజాకార్ల వ్యతిరేక ఉద్యమ సమయంలో జగిత్యాలలో జరిగిన ఘటనలను వివరించడం వల్ల ఇప్పటి యువతరానికి ఆ ఉద్యమాల ప్రాధాన్యత తెలుస్తుంది.

అలాగే తెలంగాణ తోలి ఉద్యమం 1952 లో జరిగినప్పటి సిటీ కాలేజి సంఘటన, 1969 నాటి ఉద్యమ ఘటనలను, అందులో ఆయన పాత్రను సాక్షిగా చక్కగా వివరించారు. ప్రభుత్వ బళ్ళలో కూడా ఫీజులు పెంచితే, అవి ఆ రోజులలో (1966) కూడా విద్యార్థులు అల్లరులు చెయడం, అందులో జగిత్యాలలో పోలిస్ ఫైరింగ్ జరగడం, ఒకరు చనిపోవడం అనే విషయం ఆశ్యర్యకరమైనదే.  కాకుండా ఆవిషయాలు నాలాంటి కొందరికే తప్ప ఈతరానికి ఆసలే తెలియవు.

జగిత్యాలలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ సంఘటనలైన మన దేశ ప్రధాని , ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధి,ఈజిప్ట్ దేశాధ్యక్షుడులాంటి మహనీయుల మరణ సమయంలో జగిత్యాలలోని స్పందనను  చక్కగా వివరించారు.

అలాగే ప్రపంచంలో, దేశంలో జరిగిన అనేక సంఘటనలను రేఖామాత్రంగా ఇందులో చిత్రీకరించారు. తేదీలు తెలిసినా, సంఘటన తెలిసినా దానికి సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో తెలిసికోవచ్చు. ప్రాంతీయ విషయాలకు, సంఘటనలకు, సభలు సమావేశాలకు తగిన ప్రాధాన్యతా ఇచ్చారు. స్కైలాబ్ సంఘటన వివరాలు వివరణాత్మకంగా చెపుతూ, ఆనాటి భయాను తొలగించదానిక్ యాన చేసిన కృషిని తెలిపారు.

అమెరికా దేశంలో ఉగ్రవాదులు జరిపిన దాడిన నుండి గత సంవత్సరం రామనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆతరువాత అల్త్ప్బార్ 23 వతేదీ 2 017 న కరీంనగర్లో ఆయనకు జీవన సాపల్య పురస్కారం ఇవ్వడం వరకు దాదాపు అన్ని ముఖ్య సంఘటనలను, తేదీలను ఇందులో పొందుపరిచారు.

చిన్న సంఘటనలకు ప్రాధాన్యం:-

ప్రపంచ ప్రసిద్ది పొందిన సిద్దిపేటకు చెందిన, చిత్రకారుడు కాపు రాజయ్య చిత్ర కళా ప్రదర్శనను జగిత్యాల గుర్తింపుపొందిన పారశాలల సంఘం అద్వర్యంలో తేది 23-10-2001 – 25-10-2001 వరకు  నిర్వహించాము. అప్పుడు ఆసంఘానికి నేనే అధ్యక్షున్ని. అయినా నాదగ్గర దానికి సంబందించిన  వివరాలు లేవు. కాని ఈ పుస్తకం చూసి అతేదిలను తెలుస్కోని ఆశ్చర్య పోవడం నావంతైనది.  అలాగే నేను నా శాతవాహన హైస్కూల్ బ్రాంచ్ ను టవర్ దగ్గర ప్రారంభించిన తేది కూడా వారి డైరీలో నమోదై ఉంది.

ప్రపంచ రాజకీయాల దృష్టిని ఆకర్షించిన జగిత్యాల జైత్ర యాత్ర తేది, అందులో పాల్గొన్న నాయకుల పేర్లను ఇందులో ఉల్లేఖించారు.ఆధ్యాత్మికంగా ఆయన చేసిన సేవలు, చినజీయర్ స్వామి మంగళ శాసనాలు, ఆయన రాక ఇతర వివరాలను చక్కగావ్రాసారు.

ఆజం ఘోరి ఎదురుకాల్పులకు గురైన రోజును కూడా విడిచిపెట్టకుండా వివరించారు. అంటే జగిత్యాలలో జరిగిన, జరిగే సభలు సమావేశాల వివరాలను ఎంత భద్రంగా సేకరించి ఉంచారో  తెలువడమే కాకుండా, చరిత్రలో వాటి విలువేమిటో గుర్తించిన ఒక చరిత్రకారునిగా ఆయన వ్యక్తిత్వం మన కళ్ళముందు నిలుస్తుంది.

చరిత్ర, ఇతర రచనలు:-

చరిత్ర పరిశోధనా  గ్రంథాలు, విషయ పరిచయ పుస్తకాలు, స్థల పురాణాలు, మేధావుల జీవన పరిచయాలు, డైరీలు తదితర వ్విశాయాలలో ఇంగ్లీష్, ట్లుగులలో కలిల్పి 33 పుస్తకాలు వ్రాసారు. రమనయ్యగాఆరి పరిశోధనా గ్రంథం “ దక్షిణ భారత దేవాలయాలు” ఇంగ్లిష్ లో ప్రచురించబడి దాదాపు 120 దేశాల విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలకు పంపబడడం విశేషం.

ఇక్కడ నేను రాసింది చంద్రునికొక నూలుపోగులాగా, కొండను అద్దంలో చూపినట్లు చిన్న పరిచయం మాత్రమె. ఈ స్వీయ చారిత్రలో రాసిన విషయాలను కొన్నింటిని మాత్రమే స్పర్శిస్తూ, వివరిస్తేనే ఇంతగా రాయాల్సి వచ్చింది. ఇందులోని చాల విషయాలను ఇంకా నేను చెప్పనే లేదు. నిజంగా ఇది ఒక చారిత్రాత్మక గ్రంధం. జగిత్యాల ప్రజల చరిత్ర…. ప్రాంత చరిత్ర…. మనను మనం తెలుస్కోవడానికి ఉపయుక్తమైన పుస్తకం జైశెట్టి రమణయ్య రాసిన “సొంత ఎదుగుదల”…

IMG_20180329_205255