జగిత్యాల, కోరుట్ల ప్రజలందరికీ వందనాలు…ఆదరించి, ఆశీర్వదించండి – నిజామాబాద్ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి కల్వకుంట్ల కవిత

ss fb 11111జగిత్యాల జిల్లా, మార్చి23: సిరిసిల్ల శ్రీనివాస్, telanganareporter.news


*ఎక్కని కొండ లేదు…మొక్కని బండ లేదు…పసుపు, ఎర్ర మొక్కజొన్న రైతుల కోసం మేం చేయని పని లేదు…

* ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసెలా కాంగ్రెస్ కుట్రపూరితంగా ఎలక్షన్ ఆగం చేసేలా వ్యవహరిస్తుంది

IMG_20190323_165547

ఎక్కని కొండ లేదు…మొక్కని బండ లేదు...పసుపు, ఎర్ర మొక్కజొన్న రైతుల కోసం మేం చేయని పని లేదు…రైతుల కోసం చెసిన పనులను చెప్పుకుంటూ పోతే, ఎంత సేపు చెప్పినా సమయం చాలదంటూ, నిజామాబాద్ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు..

IMG_20190323_164245

శనివారం జగిత్యాల సెగ్మెంట్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చుట్టిన అనంతరం, జిల్లా కేంద్రంలోని తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ
జగిత్యాల, కోరుట్ల ప్రజలందరికీ వందనాలు...మీ అందరి దయతో ఎంపిగా గెలిపించి ..దేశంలో అత్యున్నత వ్యవస్థ భారత పార్లమెంట్ లో అనేక అంశాలపై ప్రజా సమస్యలపై గళం విప్పే అవకాశం కల్పించడం అదృష్టమన్నారు.

IMG-20190323-WA0466

పార్లమెంట్ సభ్యురాలిగా నాకిచ్చిన అవకాశంతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతిష్ఠ ను పెంచడం జరిగిందన్నారు.

జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగిందని వివరించారు.

మళ్లీ పోటీ చేస్తున్నాను…జగిత్యాల, కోరుట్ల ప్రజలు దీవించి, ఆశీర్వదించండి…అని కోరారు.

IMG-20190323-WA0451

బిజెపి, కాంగ్రెస్ లకు ప్రజల్లో విశ్వాసం లేకపోయినా, అన్ని స్థానాల్లో పోటీకి వెనకాడుతూ…రైతుల పేరిట నిజామాబాద్ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కుట్రకు పూనుకుంటున్నారని విమర్శించారు.

రైతుల కోసం రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ అనుబంధం పెంచుకుంటే, వారితో ఉన్న అనుబంధాన్ని రైతులనుంచి దూరం చేసె కుట్రకు, అగాధం సృష్టించే ప్రయత్నాలకు కాంగ్రెస్ పూనుకుంటుంది….ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసెలా కాంగ్రెస్ కుట్రపూరితంగా ఎలక్షన్ ఆగం చేసేలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.

నిజంగానే …నా మీద నామినేషన్ వేస్తే,
రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయంటే నాకు అంతకన్నా సంతోషం మరోటిలేదన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా ప్రజల మధ్యే ఉంటూ అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నా వంతు కృషి చేశాను…పార్టీ అధిష్టానం తనకు మరోసారి ఇచ్చిన అవకాశంను మరింత బాధ్యత తో నెరవేరుస్తానన్నారు.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు
ప్రజల్ని అయోమయం చేసి, అబధ్దాలు చెప్పి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు…వీటిని ప్రజలు గమనించాలని కోరారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ , కేంద్రప్రభుత్వానివేనని సోషల్ మీడియా లో టిఆర్ ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

గుజరాత్ రాష్ట్రంలో రు. 700 వృధ్దాప్య పెన్షన్ ఉంటే..తెలంగాణ రాష్ట్రంలో రూ. 2000 చేశారు. ఇది ప్రజలు గమనించాలి..టిఆర్ఎస్ ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుందనీ, కాంగ్రెస్, బిజెపి లు ప్రజల్ని వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.