జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో వరుస ఎన్‌కౌంటర్లు…8 మంది ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : 01-0402018,

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో వరుస  ఎన్‌కౌంటర్లు జరిగాయి. అనంత్‌నాగ్‌లోని డయాల్‌గామ్, సోపియాన్ జిల్లాలోని కచ్‌డూర్, డ్రాగడ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

kashmir

దీంతో…. ఆదివారం తెల్లవారుజామున భారత సైనికులు సోదాల్లో…… డయాల్‌గామ్ ప్రాంతంలో ఒక టెర్రరిస్టును మట్టుబెట్టగా, మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. డ్రాగడ్‌లో ఏడుగురు టెర్రరిస్టులను హతం చేశారు సైనికులు….. కచుడూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. హతమైన ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం సైనికుల ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. హతమైన ఉగ్రవాదులు.. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబాకు చెందిన వారు.