జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు …. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, మార్చి 15: తెలంగాణ రిపోర్టర్, sircilla srinivas


IMG-20190315-WA0350
దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.
https://youtu.be/o8kTrUFRjYk
శుక్రవారం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  ఎంపి కవిత మాట్లాడుతూ….
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యం. అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలు ఉంటాయి….జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు టీఆర్ఎస్ కు తెలంగాణ అంశాలు టీఆర్ఎస్ చూస్తున్నదన్నారు. బిజెపి విభజన హామీలపై కొట్లాడినం…తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు తక్కువగా ఉంటే ఆ సంఖ్య పెంచమని కేంద్రం చుట్టూ తిరిగాం..
హక్కు భుక్తంగా రావాల్సిన ఎయిమ్స్ ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నాం..
నిజామాబాద్ రైల్వే లైన్ ను నిధులు సాధించి..పూర్తి చేశామని వివరించారు.
IMG-20190315-WA0349
బిజెపి, కాంగ్రెస్ దొందూ దిందే..ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి ఆ పార్టీలు…వాళ్ళు చేసిందేమీ లేదు కాబట్టి, వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మందిరం,మసీద్, బోఫోర్స్, రాఫెల్ అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారు…..మమ్మల్ని ఢిల్లీకి ఆశీర్వదించి పంపిస్తే…తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాం అని ఆమె అన్నారు.
ఇప్పుడు 16 టీఆర్ఎస్ 1 ఎం ఐ ఎం అభ్యర్థులను గెలిపిస్తే..సైనికుల్లా పనిచేస్తాం….గతంలో ఇద్దరు జేడీఎస్ ఎంపీలు గెలిస్తే, ఒకరు ప్రధాని అయ్యారు.ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించాం..
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు….మన కేసిఆర్ లీడర్..దేశాన్ని సరైన మార్గంలో నడిపించడమే కాక మంచి మార్గం లో నడుపుతాడు. సీఎం కేసిఆర్ కు విజన్, దార్శనికత ఉంది…..అది
దేశానికే దిశానిర్దేశం..ఫెడరల్ ఫ్రంట్ పెట్టిందే దేశ ప్రజల కోసంమన్నారు. 
కాంగ్రెస్ వాళ్లు మా పార్టీ బిజెపి కి బి – టీమ్ అంటున్నారు…బిజెపి వాళ్ళు కాంగ్రెస్ కు బి – టీమ్ అంటున్నారు.. కానీ మేం తెలంగాణ ప్రజలకు బి – టీమ్.. షి టీమ్స్,  మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఏడెనిమిది రాష్ట్రాలు రైతు బందు అమలు చేస్తున్నాయి….కిసాన్ సమ్మాన్ ను ఎన్నికల ముందు ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు.
రైతు బంధు అమలుకు ముందే మనం భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. బిజెపి రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో భూముల వివరాలు సరిగా లేవని ఎద్దేవా చేశారు…..రాహుల్ గాందీ..పేదలకు నెలకింత అని ఇస్తారట. నానమ్మ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తే..ఆయన దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి,  సైనికుల్లా ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు….19 న నిజామాబాద్ లో జరిగే సీఎం బహిరంగ  సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం సభ నిర్వహిస్తున్నాం. అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
విలేఖరుల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజి గౌడ్, మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ నాయకులు ఈగ గంగారెడ్డి, దాదన్నగారి విఠల్ రావు, ఎ ఎ ఎస్ పోశెట్టి పాల్గొన్నారు.