జిల్‌..జిగేల్‌..గోల్కొండ!!!!..

దేశ విదేశీ అతిథులు..ఆహా అనిపించే రుచులు..ప్రపంచ సుందరి అడుగులు.. వెరసి గోల్కొండ కోట మురిసింది. బుధవారం జీఈఎస్‌ ప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ వంటకాల ఘుమఘుమలకు అతిథులు ఫిదా అయ్యారు. మంత్రి కేటీఆర్, మేయర్‌ రామ్మోహన్, సానియా మీర్జా, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచారు.