జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ఫోన్‌ను విడుదల చేసిన అసుస్

 

ASUS  అసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి.

ASUS-Zenfone-Max-M2-Latest

ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మెమొరీ కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈకి సపోర్ట్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండగా, ఇందులో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చారు. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదల కాగా దీనికి చెందిన 3 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.9,999 ధరకు, 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఈ నెల 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ఫీచర్లు…

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.