టియుడబ్ల్యుజె 2019 క్యాలెండర్‌, డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

IMG_1548440677732జగిత్యాల, sircilla srinivas, 9849162111


IMG-20190205-WA0292

నియోజకవర్గం అభివృద్ధి లో పాత్రికేయుల పాత్ర ఎంతో ఉంటుందనీ, శాసన సభ్యునిగా తాను చేపట్టే ప్రజోపయోగమైన కార్యక్రమాలకు సహకరించాలని జగిత్యాల శాసన సభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ అన్నారు.

IMG-20190205-WA0297

టియుడబ్ల్యుజె 2019 క్యాలెండర్‌, డైరీ ని ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.సురేందర్ కుమార్, బండ స్వామి, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇమ్రాన్, ఐజెయు జాతీయ కౌన్సిల్  పూర్వ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు సిహెచ్ వి ప్రభాకర్ రావు తో పాటు చీకోటి శ్రీనివాస్ రావు, రాజేందర్ రెడ్డి, తిరునగరి శ్రీనివాస్, చంద్ర శేఖర్, ఆరిఫ్, సత్యం, సుధీర్, రవి, ఖాజాసల్మాన్, జహీర్, సంపూర్ణ చారి, గాజుల నాగరాజు, శ్రీనివాస్, మహేష్, మోసిన్, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

IMG-20190205-WA0291

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ….. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ప్రజా సమస్యల పరిష్కారములో పాత్రికేయుల కృషి ప్రశంసనీయమన్నారు.

తన గెలుపులో పాత్రికేయులు అందించిన సహకారం ఎంతో గొప్పదన్నారు.నియోజకవర్గం అభివృద్ధి లో సహకరించాలనీ, పాత్రికేయులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.