తెలుగు మహాసభల కోసం హీరో హీరోయిన్ల డాన్స్!!!!…

Image result for mehreen vijay devarakonda images

అందాల ముద్దుగుమ్మ మెహరీన్‌. అర్జున్ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ. ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారు ఎందుకు అలా ఫొటోలు దిగారో. రహస్యం ఏంటో ఎవరికీ చెప్పలేదు. ఆయన బయట పెట్టలేదు. తాము ఒక సీక్రెట్ ప్రాజెక్టు చేస్తున్నట్లు ముందే చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఓ సాంగ్ షూట్ లో చేశారని తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం అని తెలుస్తోంది. ఈ మహాసభల కోసం డైరెక్టర్ హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి కలిసి ఓ స్పెషల్ సాంగ్ ను తెరకెక్కించారు. ఇందులో విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌, ఈషా రెబ్బా తదితరులు నటించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడుతూ ఈ పాటను రూపొందిస్తున్నట్లు సమాచారం.
                                  ఈ సెట్‌లో మెహరీన్‌, వంశీ పైడిపల్లి, యూనిట్‌ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను విజయ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మెహరీన్‌ కూడా కొన్ని ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం కనిపించింది. ఇద్ద‌రు హోలీ రంగుల‌లో మునిగి తేలిన‌ట్టుగా ఉన్న ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. వీరరివురు ఏ సంద‌ర్భంలో ఈ పిక్ దిగారో తెలియ‌క అభిమానులు రెండు రోజులుగా జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. సినిమాలు ఏమి లేకపోయినా వారు ఎందుకు ఫొటోలు దిగారంటే వచ్చిన సమాధానం తెలుగు మహాసభలు. అదండీ సంగతి.