దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జోరు…భారత మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు

ముంబై:

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జోరు కొనసాగుతోంది. భారత మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరుపుతోంది. నవంబర్‌లో ప్యాసింజర్ వెహికిల్(పీవీ) మోడళ్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా మారుతి స్విఫ్ట్ రికార్డు సృష్టించింది.

maruti-suzuki-swift

balenoB

images

గ‌తేడాది ఇదే నెల‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన కంపెనీ తయారు చేస్తున్న ఎంట్రీ లెవల్ ఆల్టో కారును వెన‌క్కి నెట్టింది. దీంతో ఆల్టో ఈసారి నాలుగో స్థానానికి ప‌డిపోయింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్‌) ద‌గ్గ‌రున్న‌ వివ‌రాల ప్ర‌కారం న‌వంబ‌ర్‌లో 22,191 స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. గ‌తేడాది ఇదే నెల‌లో ఆరోస్థానంలో నిలిచిన స్విఫ్ట్ .. కేవ‌లం 13,337 కార్ల‌ను మాత్ర‌మే అమ్మ‌కాలు జ‌రిపింది.

మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన స్విఫ్ట్(1), డిజైర్(2), బాలెనో(3), ఆల్టో(4), విటారా బ్రెజా(5), వాగన్ ఆర్(6) ఎక్కువగా అమ్ముడైన కార్లలో తొలి ఆరు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు హ్యుందయ్ సంస్థ తయారు చేస్తున్న ఎలైట్ ఐ20(10,555 కార్లు) ఏడో స్థానం దక్కించుకుంది. ఎస్‌యూవీ క్రెటా(8వ).. గ్రాండ్ ఐ10(9వ).. సాంత్రో(10వ) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. భారత్‌లో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని రోజురోజుకీ పెంచుకుంటోంది.