ధర్మపురిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు…

👉 స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పునీతులైన భక్త జనం


తెలంగాణ రిపోర్టర్, డా.మధు మహాదేవ శర్మ, ధర్మపురి, డిసెంబర్ 18


IMG-20181218-WA0648

సుప్రసిద్ధ హరిహర పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగింది.

IMG-20181218-WA0651

ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాల అలంకరణ లతో ముస్తాబు చేశారు.

పశ్యన్నిమిష మాత్రేణ కోటి యజ్ఞంఫలం లభేత్ … అని పవిత్రమైన ఈ రోజు తేజో మూర్తి అయిన స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని దర్శిస్తే కోటి యజ్ఞ ఫలం సిద్ధిస్తుందనీ ప్రతీతి .

అందుకే భక్తులు దూరప్రాతాల నుండి వర్షం, చలి నీ సైతం లెక్క చేయకుండా ధర్మపురి కి చేరుకొన్నారు.దేవస్థానం నుండి ఇసుక స్థంభం వరకు క్యూలైన్ లో ఓపికగా నిలుచొని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకు న్నారు.

IMG-20181218-WA0649

ఉదయం రెండు గంటల 30 నిమిషాలకు లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విరాట్లకి ప్రత్యేక అభిషేకం , మంగళనీరాజనం, మహా మంత్రపుష్పం నిర్వహించారు.

ఈ అభిషేక కార్యక్రమం లో పలు ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆలయ నిర్వహణాధి కారి, డెప్యూటీ కలెక్టర్ పి. అమరేందర్ లు పాల్గొన్నారు.

వేదపండితుల మంత్రోచ్చారణల తో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ముక్కోటి ఏకాదశి ప్రాతఃకాలమున నాలుగు గంటలకు వైకుంఠ ద్వార ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప వేదికపై న మువ్వురు స్వాములను ఆసీనులు గావించి ప్రత్యేక పూజలు సహస్రనామార్చనలు నివేదనలు సప్త హారతులనీరాజనం, మంత్రపుష్పము సమర్పణ చేసారు.

అనంతరం వేద ఘోష మహాదాశీర్వచనములు, కళ్యణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు, వేదపండితలు ఐదు గంటలకు మంగళ వాయి ధ్యాలతో వేద మంత్రోచ్ఛారణలతో ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వామి, శ్రీ శ్రీ శ్రీ సద్గురు విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిచే వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజ అనంతరం వైకుంఠ ద్వారం తెరిచి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

అనంతరం స్వామి వారి ప్రసాద వితరణ చేశారు. తుఫాన్ కారణంగా స్వామి వారి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగంపును వాయిదా వేశారు.

స్వరాభిషేకం….

IMG-20181218-WA0629

సాయంత్రం శేషప్ప కళావేదికపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి స్వరాభిషేకం ప్రముఖ రేడియో టీవీ కళాకారులు తెలంగాణ రత్న అవార్డు గ్రహీత శ్రీ గుండి జగదీశ్వర్ , సురేఖా మూర్తి, నిత్య సంతోషిణి వారిచే సంగీత విభావరి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపని పొందారు.

2019 నూతన సంవత్సర క్యాలెండర్  ఆవిష్కరణ:

దేవస్థానం వారి 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ని శ్రీశ్రీశ్రీ సచ్చిదాంద సరస్వతి,విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ , చేతులమీదుగా ధర్మపురి ఎం ఎల్ ఏ కొప్పుల ఈశ్వర్ ,దేవస్థానం చైర్మన్, ఆలయ ఈవో లచే కలసి ఆవిష్కరణ చేశారు.అనంతరం కొప్పుల మాట్లాడుతూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం అదృష్టం గా భావిస్తున్నానని,భక్తులు, ప్రజలు ఆయురారోగ్యాల తో సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభవృద్ధి ధ్యేయంగా పనిచేస్తు న్నారని వారికి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని, సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్వామి వారిని కోరుకున్నాననీ అన్నారు.

ముక్కోటి సందర్భంగా దూరప్రాంత భక్తులకు ఆర్టీసీ యాజమన్యం ప్రత్యేక బస్సలను ఏర్పాటు చేసింది. ధర్మపురి మునిసిపాలిటీ గోదావరి పరిసర ప్రాంతాలు ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వెంకట రమణ, ధర్మపురి పట్టణ సిఐ లక్ష్మీ బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి అమరెందర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ దంపతులు, జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశం, డిఎస్పీ వెంకటరమణ, సీఐ లక్ష్మీ బాబు, ఎస్సైలు , పోలీస్ సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు అక్కినపెళ్లి సునీల్ కుమార్,సాయిని శ్రీనివాస్,ఇనగంటి వెంకటేశ్వరరావు,దోమకొండ తిరుపతి,మామిడి.లింగన్న, రాచకొండ నరేందర్,కోట బుచ్చి గంగాధర్,జెట్టి రాజన్న,మధు నాట్రాజ్,శివనీతి రమ్య,మురికి భాగ్యలక్ష్మి, జోగినపెళ్లి రమాదేవి,ఆలోళ్ళ మురళీధర్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.