ధర్మపురి లో కన్నుల పండువగా రథోత్సవం….

ధర్మపురి : తెలంగాణ రిపోర్టర్ : మధు మహదేవ్, www.telanganareporter.news

IMG-20180307-WA0588

  • ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు……..
  • భక్త నీరా *జనం* ………..
    సుదూర ప్రాంతాలనుండి తరలివచ్చిన భక్తులు ..గోవింద నామస్మరణతో మార్మోగిన ధర్మపురి క్షేత్రం..

IMG-20180307-WA0597

పుణ్యక్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో ఫిబ్రవరి 26 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టం రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవోపేతంగా జరిగింది.

*పశ్యన్నమిష మాత్రేన కోటి జన్మ ఫలం లభేత్*

అని రథారూఢులైన స్వామిని దర్శించిన మాత్రముననే కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్న వేదప్రమాణంను అనుసరించి ఈ రథోత్సవంను ఘనంగా నిర్వహించడం ధర్మపురి ప్రత్యేకత …..

IMG-20180307-WA0618

ఏటా సాంప్రదాయ రీతిలో జరుపుకొనే క్రమంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా మధ్యాహం మూడు గంటలకు ముందుగా వేదమంత్రాలతో, మంగళవాయిద్యాలతో దేవస్తానం ముందు భాగాన సర్వాన్గాసున్దరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలఫై ముగ్గురు స్వామివార్లను ఆసీనులగావించారు.   

అనంతరం… రథాల ముందుభాగాన, బలిహరణం,

IMG-20180307-WA0593

అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

IMG-20180307-WA0591

దేవస్థాన పౌరోహితులు కందాలై పురుశోత్తమాచార్యాలు,ఆస్థాన వేదపండితులు బొజ్జరమేష్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

IMG-20180307-WA0589

ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ ల ద్వారా అశేష భక్త జనం రథాలఫైకి నిచ్చెనల ద్వారా వెళ్లి రథారూఢులైన స్టానిక దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామి వార్లను దర్శించుకున్నారు.

IMG-20180307-WA0595

సాయంత్రం 5:30నుండి ప్రారంభించి, వేదమంత్రాలతో  మంగళవాయిద్యాలు వెంటరాగా జయజయధ్వానాల మద్య దేవస్థానం నుండి ఇసుకస్తంభం మీదుగా గ్రామపంచాయితీ కూడలి వద్ద గల నందివిగ్రహం వరకు శ్రీ నారసింహ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ రామలింగేశ్వర స్వామి రథాలను వరుసగానిలిపి భక్తజనం తోడురాగా రథాలను ఊరేగించగా ముత్తయిదువలు రోడ్డుకిరువైపులా నిలిచి మంగళహారతులు పట్టారు.

IMG-20180307-WA0588

భక్తుల పారవశ్యాల మధ్య చీకటి పడ్డాక నృసింహుడు, విముఖుడై వెంకటేశ్వర్లు , రామలింగేశ్వరులు సుముఖులై వెనుతిరిగారు.అనంతరం దేవస్థానం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.గోదావరికి ఊరేగింపుగా వెళ్లి చక్రతీర్థ మంగళ స్నానాలు ఆచరించారు. ప్రముఖులు రథాలను అధిరోహించి పూజాదికాల్లో పాల్గొన్నారు.

IMG-20180307-WA0613

స్థానిక సి ఐ లక్ష్మి బాబు ఆద్వ్యర్యంలో ఎస్ ఐ లక్ష్మినారాయణ , ప్రత్యేక  పోలీస్ బృందాలు రోడ్డు కిరుపక్కలా ముందుండి తాళ్లద్వారా రథాల రాకపోకల సమయంలో రద్దీని క్రమబద్ధీకరించారు.

స్థానిక నేతలు మార్గనిర్దేశనం చేసిన  రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.చివరిగా గోదావరిలో చక్రతీర్థ స్నానానంతరం ఆచారం ప్రకారం మద్వాచారి సందీప్, రామకిషన్ , పవన్, గృహాలలో స్వామి వారు భక్తజన సమేతుడిగా పూజాదికాలు అందుకొని, విందు ఆరగించి రాత్రి దేవస్థానానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమం లో దేవస్థానం ఈ ఓ సుప్రియ, చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ సంగి సత్తెమ్మ, ధర్మపురి జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్, పిఎసిఎస్ చైర్మెన్ బాదినేని రాజేందర్ , వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ అల్లం దేవమ్మ, వైస్ ఎంపిపి రాజేష్  ధర్మకర్తలు సునీల్, జెట్టి రాజన్న, వెంకటేశ్వరరావు లింగన్న, దేవస్థాన మాజీ చైర్మెన్లు సంగనభట్ల దినేష్ శర్మ, రాజేందర్ తదితరులుపాల్గొన్నారు

రథోత్సవంలో భాగంగా..  ముందుగా రథానికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొన్నారు. వైదికాశీస్సులు పొందారు.