ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక నే సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు.

www.telaganareporter.news✍

ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక నే సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు.

IMG-20190213-WA0019
👉ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్
బాదినేని రాజేందర్

ధర్మపురి
13 ఫిబ్రవరి 2019

✍తెలంగాణ రిపోర్టర్
డా.మధు మహాదేవ్ శర్మ

తనను ధైర్యంగా ఎదుర్కొ నే
దమ్ము సత్తా లేకనే సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు తనపై ఆరోపిస్తున్నారని ధైర్యం ఉంటే ప్రజా కోర్టులో నేరుగా ముఖాముఖి ఆరోపణలు చేసి నిజానిజాలు చర్చించాలని, చర్చకు తానుఎప్పుడైనా రెడీ అని ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్ అన్నారు.
మొన్న సోమవారం రోజున స్థానిక ఎస్ హెచ్ గార్డెన్లో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
పార్టీలోని కొందరి గురించి తీవ్రమైన ఆగ్రహంతో ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో తాను ఎంతో కృషి చేస్తూ ఉండగా పార్టీ నేతలు కొందరు కమిషన్లు డబ్బులు తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ , ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలాలో లబ్ధిదారుల నుండి నాయకులు గానీ కార్యకర్తలు గానీ అధికారులు గాని కమిషన్లు డబ్బులు అడిగితే వారిని చెప్పుతో కొట్టాలని అన్నారు. పార్టీలో ఉంటూ మరో పార్టీకి ప్రచారం చేసి తన ఓటమికి కృషి చేశారని ఇంటి దొంగల గురించి ప్రస్తావించారు. డబ్బులు తీసుకొని మరి తనను ఓడించుటకు తన పార్టీలోని కొందరు కార్యకర్తలు, నేతలే కంకణం కట్టుకున్నారని వారందరి చరిత్ర తనకు తెలుసని చేసిన వ్యాఖ్యలు ప్రధాన మీడియా తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తున్న కొప్పుల ఈశ్వర్ పక్కనగల ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్ ను బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియాలో ని ఫేస్బుక్ వేదికగా తెలంగాణ పోలీ ట్రిక్స్, పల్స్ ఆఫ్ తెలంగాణ అను పేర్లతో అకౌంట్లు నడుపుతున్న కొందరు బాణంగుర్తుతో ఫోటో పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బాదినేని రాజేందర్ బుధవారం పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించి వాటిని తీవ్రంగా ఖండించారు.
తమ పార్టీలో ఇంటి దొంగలు ఉన్న మాట వాస్తవమేనని ఆ విషయాన్ని గమనించిన కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత కార్యక్రమ వేదికగా ఆరోపించిన ఆరోపణలు తనను కాదని ఫేస్బుక్ వేదికగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.

IMG-20190213-WA0018
రాజకీయపరంగా సామాజిక పరంగా తనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో సృష్టిస్తున్నారని గతంలో సైతం ఇలాంటి ఆరోపణలు చేయడం అవి అబద్ధాలని తెలియడంతో మరో కోణంలో తనపై అసత్య ప్రచారం చేస్తూ పార్టీలో సమైక్యంగా ఉన్న కార్యకర్తల నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికి పన్నిన పన్నాగం అని వారు ఆరోపించారు.
ఫేస్బుక్ లో వచ్చిన వాటిని తీవ్రంగా ఖండించారు స్వయంగా కొప్పుల ఈశ్వర్ తనను అనలేదని ఫేస్బుక్ వేదికగా వివరణ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ సాధన కోసం మొదలుకొని నేటి వరకు ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ వెన్నంటి అండగా ఉన్నానని తన మండలాలైన ధర్మపురి బుగ్గారం మండలాల్లోనే ప్రతిసారి మెజారిటీ వచ్చిందని రాజేందర్ అన్నారు. పార్టీ లో జరిగే ప్రతి విషయానికి తనను బాధ్యుడిని చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వం గురించి ఈశ్వర్ కు బాగా తెలుసని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగుల ను తనకు గిట్టని వారే పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తాజా ఎన్నికల్లో పార్టీకి ఎవరు వెన్నుపోటు పొడిచింది అందరికీ తెలుసని, ఇంటి దొంగల పని నీ ఈశ్వరుడు త్వరలోనే పడతారని అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందే అవకాశా లన్నింటిని డబ్బులకు అమ్ముడు పోయి ఎవరు దూరం చేశా రో అందరి జాతకాలు ఈశ్వర్ వద్ద ఉన్నాయని అయితే ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను తనకు ఆపాదించడం కరెక్ట్ కాదని నిజానిజాలు తెలుసుకోకుండా ఫేక్ అకౌంట్ ల తో సోషల్ మీడియాలో అసత్య పోస్టింగ్లు పెడితే చూస్తూ సహించేది లేదని వారిపై చట్టరీత్యా చర్యకు సిద్ధమవుతామని అన్నారు.