jagtial, 22-04-2019, telanganareporter.news
తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో శ్రీమత్ కాశీ సింహాసనాదీశ్వర 1008 జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ చంద్రశేఖర శివా చార్య మహా స్వామి సహస్ర ల మీదుగా జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు, జ్యోతిష్య విధ్వాంసులు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కారం ప్రధాన మహోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా చంద్రశేఖర శివా చార్య మహా స్వామి మాట్లాడుతూ…..
.. నేటి కలియుగంలో గురు ప్రబోధనలు మార్గదర్శకాలని, ప్రజలంతా ఆధ్యాత్మిక సేవలో పునరంకితం కావాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంటి జగదీశ్వర స్వామి, కళాశ్రీ గుండేటి రాజు, పాంపట్టి రవీందర్, వల్లాల గంగాధర్, నలమాసు గంగాధర్, కొత్తపెళ్లి శ్రీనివాస్, మానాల కిషన్. సుబ్రమణ్యం, శివ కుమారు, మర్రి పోచాలు, గరిపెల్లి శంకర్, మహిళలు పాల్గొన్నారు…