నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఐపీఎల్ ఫైనల్లో…. ముంబై విజయం

నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఐపీఎల్ ఫైనల్లో చివరకు ముంబైనే విజయం వరించింది.

పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని చిత్తు చేసే అనుభవానికి తోడు.. నాకౌట్స్‌లో చెన్నైపై ఉన్న అద్వితీయ రికార్డును కాపాడుకుంటూ రోహిత్ సేన నాలుగోసారి ట్రోఫీ అందుకుంది.

ipl-2019

అచ్చొచ్చిన భాగ్యనగరంలో రోహిత్ ట్రోఫీని ముద్దాడటం ఇది రెండోసారి.

ఐపీఎల్ ఫైనల్స్‌లో అద్భుత రికార్డు ఉన్న పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పుట్టిన రోజునాడు మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబైకి పోరాడే స్కోరు అందిస్తే.. బౌలింగ్‌లో యార్కర్ కింగ్ బుమ్రా (2/14), రాహుల్ చహర్ (1/14) కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఛేదనలో షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) తుదికంటా పోరాడినా.. కీలక దశలో అతను వెనుదిరగడం చెన్నై విజయావకాశాలను దెబ్బకొట్టింది.

హైదరాబాద్‌లో ఆదివారం స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఐపీఎల్ టైటిల్ గెలువడం ముంబైకి ఇది నాలుగోసారి. రోహిత్‌సేన నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 148/7 స్కోరుకు పరిమితమైంది. వాట్సన్(80) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. తొలుత పొలార్డ్(41 నాటౌట్) రాణింపుతో ముంబై 20 ఓవర్లలో 149/8 స్కోరు అందుకుంది.

హైదరాబాద్ ఐపీఎల్‌కు ఎలాంటి ముగింపునివ్వాలో అచ్చంగా అలాంటి మ్యాచ్‌తోనే సీజన్‌కు తెరపడింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌దే పైచేయి అయింది.

mumbai-indians-ipl-trophy ok

సీజన్‌లో చెన్నైతో ఆడిన నాలుగో మ్యాచ్‌లో నూ ముంబై అదరగొట్టంది. ఆది వారం ఉప్పల్‌లో జరిగిన ఫైనలో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజ యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. పొలార్డ్, డికాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ (3/26), తాహిర్ (2/23), శార్దూల్ (2/37) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో షేన్ వాట్సన్ ఒంటరి పోరాటంతో సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది.

ipl-mumbai indians

బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భాగ్యనగరంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

చివర్లో హైడ్రామా: చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన దశలో కెప్టెన్ రోహిత్ అప్పటివరకు భారీగా పరుగులిచ్చుకున్న మలింగకు మరోసారి బంతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేసినా.. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌ల్లో బౌలిం గ్ చేసిన అనుభవం ఉన్న మలింగ 7 పరుగులే ఇచ్చి ముం బైని గెలిపించాడు. తొలి రెండు బంతులకు సింగి ల్స్ రాగా.. మూడో బంతికి డబుల్ వచ్చింది. నాలు గో బంతికి రెండో రన్‌కు యత్నించిన వాట్సన్ రనౌట్ రూపంలో వెనుదిరిగితే.. ఐదో బంతికి శార్దుల్ 2 పరుగులు తీశాడు. చివరి బంతికి యార్కర్‌తో శార్దూల్‌ను ఔట్ చేయడంతో ముంబై సంబురాల్లో మునిగిపోయింది.

స్కోరు బోర్డు:

ముంబై ఇండియన్స్: డికాక్ (సి) ధోనీ (బి) శార్దూల్ 29, రోహిత్ (సి) ధోనీ (బి) దీపక్ 15, సూర్యకుమార్ (బి) తాహిర్ 15, ఇషాన్ (సి) రైనా (బి) తాహిర్ 23, కృనాల్ (సి అండ్ బి) శార్దూల్ 7, పొలార్డ్ (నాటౌట్) 41, హార్దిక్ (ఎల్బీ) దీపక్ 16, రాహుల్ చహర్ (సి) డుప్లెసిస్ (బి) దీపక్ చహర్ 0, మెక్లెనగన్ (రనౌట్) 0, బుమ్రా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 20 ఓవర్లలో 149/8. వికెట్ల పతనం: 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141, బౌలింగ్: చహర్ 4-1-26-3, శార్దూల్ 4-0-37-2, హర్భజన్ 4-0-27-0, బ్రేవో 3-0-24-0, తాహిర్ 3-0-23-2, జడేజా 2-0-12-0.

చెన్నై సూపర్‌కింగ్స్: డుప్లెసిస్ (స్టంప్డ్) డికాక్ (బి) కృనాల్ 26, వాట్సన్ (రనౌట్) 80, రైనా (ఎల్బీ) రాహుల్ 8, రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 1, ధోనీ (రనౌట్/ఇషాన్) 2, బ్రేవో (సి) డికాక్ (బి) బుమ్రా 15, జడేజా (నాటౌట్) 5, శార్దూల్ (ఎల్బీ) మలింగ 2, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 148/7. వికెట్ల పతనం: 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148, బౌలింగ్: మెక్లెనగన్ 4-0-24-0, కృనాల్ 3-0-39-1, మలింగ 4-0-49-1, బుమ్రా 4-0-14-2, రాహుల్ 4-0-14-1, హార్దిక్ 1-0-3-0.