నాసా క్యూరియాసిటీ రోవర్ తీసిన 360 డిగ్రీల పనోరమిక్ వ్యూ మార్స్ ఫొటో

హూస్టన్:

నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మార్స్ ఉపరితలానికి సంబంధించిన 360 డిగ్రీల పనోరమిక్ వ్యూ ఫొటోను తీసింది.

దుమ్ము తుఫాను కారణంగా ఎర్రగా మారిపోయిన అక్కడి ఆకాశాన్ని ఈ ఫొటోలో మనం చూడొచ్చు.

curiosity mars nasa

ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ మార్స్‌పై ఉన్న వేరా రూబిన్ రిడ్జ్‌పై ఉంది. తుఫాను కారణంగా దుమ్ముపట్టిపోయిన రోవర్ కూడా ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ రోవర్ ఇప్పటికే అంగారకుడిపై తవ్వకాలు జరిపి అక్కడి శిలల నమూనాలను భూమికి పంపించింది. అయితే కాస్త కఠినమైన ఉపరితలం కారణంగా కొన్ని రోజులుగా డ్రిల్లింగ్‌ను ఆపేసింది. అయితే అవి అంత కఠినంగా ఉండటానికి కారణం ఏంటన్నదానిపై నాసా శాస్త్రవేత్తలు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. రోవర్‌లో ఉన్న రెండు లేబొరేటరీల్లో శిలల నమూనాలను పరీక్షించి అవి అంత కఠినంగా ఉండటానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ మరో డ్రిల్స్ చేపట్టనుంది. ఆ తర్వాత మౌంట్ షార్ప్‌పైకి వెళ్లి అక్కడున్న క్లే, సల్ఫేట్ ఖనిజాల జాడను వెలికితీయనుంది.