నా భర్తను కాపాడండి సార్…మా డాడీని రప్పించండి సార్..

జగిత్యాల జిల్లా: మే 31: sircilla srinivas 9849162111

కొడిమ్యాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణ గౌడ్ సస్పెన్షన్ ను ఎత్తివేయకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి వారం రోజులు గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ….

IMG_20180531_165610

సత్యనారాయణ కుటుంబ సభ్యులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట గురువారం కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ….జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఏఓ కు వినతిపత్రం అందజేశారు..

IMG_20180531_165650

తన భర్తను కాపాడాలని వేడుకుంది….జిల్లా విద్యాధికారిపై, ఆయనకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

IMG_20180531_165720

గత పదవ తరగతి పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కెసుకు సంబంధించిన నా భర్త సత్యనారాయణ గౌడ్ తో పాటు మరి కొందరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్న సంగతి తెల్సిందే. అయితే, నా భర్త సత్యనారాయణ గౌడ్ మినహా మిగతా అందరి సస్పెన్షన్ ఎత్తి వేయడం జరిగింది… ఈ కేసు విషయంలో నా భర్త పై తీసుక్నున చర్యలు విచారించి, సస్పెన్షన్ ఎత్తివేయాలన్న లేఖను సైతం జిల్లా విద్యాధికారి బేఖాతరు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా… తన భర్తను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికిగాను కొడిమ్యాల మండల పూర్వ విద్యాధికారి వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు తిరుమల్ లు తమ ఇంటికి వచ్చి, జిల్లా విద్యాధికారి పేరిట ఇప్పటికే రూ.2 లక్షలు తీసుకున్నారని కలెక్టర్ కు ఇచ్చిన లేఖలో ఫిర్యాదు చేసింది..అయినా కూడా..అదనంగా మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, వేధిస్తున్నారని ఆరోపించింది.

దీంతో   తన  భర్త గత ఏడు రోజులనుండి మానసికంగా కృంగిపోయి, ఇంటినుండి వెళ్లిపోయారనీ…ఇప్పటివరకు తిరిగి ఇంటికి చెరుకోలేదని విలపించింది….