నితిన్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్!!!!!….

Nithin Pawan Trivikram movie title Gurthunda seethakalam - Sakshi

లై’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, టైటిల్ ను గాని ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.

టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. నితిన్ సరసన  లై ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. అయితే సినిమా టైటిల్ పై వినిపిస్తున్న వార్తలను యూనిట్ సభ్యులు మాత్రం ధృవీకరించలేదు. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు