నిర్మాతను తిట్టిన రకుల్ ప్రీత్ సింగ్!!!!!..

అందాల హీరోయిన్ రకుల్ ప్రీంత్ సింగ్ ఇంటికి ఓ నిర్మాత వచ్చారు. వచ్చీ రాగానే అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మీ సంగతి నాకు తెలియదు. కథ చెప్పలేదు. ఎలా డబ్బులు తీసుకుంటానని కాస్తంత గట్టిగా మాట్లాడిందట రకుల్ ప్రీత్ సింగ్. డబ్బుల కోసం ఇదంతా చేసే టైపు నాది కాదని చెప్పిందట. అంతే కాదు.. సినిమాకు బుక్ అయితే అన్నింటిని చేయాలని చెప్పారట. అంతే అంతెత్తున లేచిందట రకుల్. మీ సినిమా వద్దు. మీరు వద్దు. ఇక్కడ నుంచి బయటకు వెళ్లండని గట్టిగా హెచ్చరించిదంట. ఊహించని ఈ సంఘటనతో ఆ నిర్మాతకు చెమటలు పట్టాయట. ఏదో హీరోయిన్ కదా అని వస్తే. ఇలా చేసింది ఏంటబ్బా అనుకుంటూ అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడట.
                            ఆ నిర్మాత పేరు చెప్పలేదు రకుల్ ప్రీత్ సింగ్. కానీ అలా అన్నందుకు తర్వాత సారీ చెప్పినట్లు రకుల్ వెల్లడించారు. అయినా సరే ఆ నిర్మాత విషయాన్ని ఫిల్మ్ నగర్ అంతా చెప్పేశారని ప్రస్తావించింది. నేను సినిమాల ఎంపికలో చాల పర్ఫెక్ట్ గా ఉంటాను.  కేవలం సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పింది. డబ్బుకోసం ఎప్పుడు తహా తహాలాడలేదు అని అందాల రాసి రకుల్ చెప్పారు. నాకు కొంచెం కోపం ఎక్కువే. ఆ కోపమే నన్ను మొన్నామధ్య నిర్మాతను తిట్టే స్థాయికి వెళ్లిందని తెలిపింది. నేను కోపం తెచ్చుకోవడానికి కారణం ఉందని నిర్మాతతో జరిగిన సంభాషణలను బయట పెట్టింది. నాతో సినిమా చేస్తానని ఓ నిర్మాత వచ్చారు. కథ కూడా పూర్తిగా చెప్పలేదు. అడ్వాన్స్ ఇస్తాను అగ్రిమెంట్‌ చేసుకుందామని సంతకం పెట్టాలని కోరాడు. కథ వినకుండా ఎలా ఒప్పుకుంటాను. అదే విషయం చెప్పాను. అయినా వినకుండా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించాడు. సహనం కోల్పొయి అరిచాను. నేను ఏ నిర్మాతతోనూ అలా ప్రవర్తించలేదు. అది పెద్ద ఇష్యూ అయిపోయిందని చెప్పిందామె.
                      ఇక పెళ్లి విషయమై రకుల్ మరోసారి తనకు కావాల్సిన వారి గురించి ప్రస్తావించింది. ఆరడుగుల ఎత్తు వుండే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. తెలుగు ప్రాంతానికి చెందిన అబ్బాయిని చేసుకుని సమంత లాగా తెలుగింటి కోడలును అవుతానేమో అని చెప్పేసింది. తెలుగింటి కోడలయితే తప్పేంటి అని ప్రశ్నించింది. రానాను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం వస్తున్న సమయంలో ఆ సంకేతాలు వచ్చేలా చెబుతోంది రకుల్.