నిషేధిత గుట్కా అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్..

www.telaganareporter.news..✍9394328296.

IMG-20181006-WA0019

రామగుండంలో నిషేధిత గుట్కా అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్..
👉రామగుండం కమిషనరేట్ లో గుట్కా అక్రమ రవాణా చేస్తే పిడి యాక్ట్ పెడుతాం.. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, అక్టోబర్-6, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-

రామగుండం కమిషనరేట్ పరిధిలో నిషేధిత గుట్కా, ఆంబార్ అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న 15 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు, ఇక నుండి ఎవరైనా నిషేధిత గుట్కా అక్రమ రవాణా చేసిన, అమ్మకాలు చేపట్టినా వారిపై పిడి యాక్ట్ పెడుతాం అని రామగుండం కమిషనరేట్ అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ అన్నారు..

IMG-20181006-WA0029
ఈ మేరకు శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.. ఈ ప్రాంత టాస్క్ పోర్స్ టీమ్స్ మరియు లా ఆర్డర్, సీసీఎస్ పోలీసుల సమన్వయంతో గుట్కా అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు..

IMG-20181006-WA0028ఈ దాడిలో 16 లక్షల విలువ గల వివిధ రకాల గుట్కా, తంబాక్ ప్యాకెట్లతో పాటు అక్రమంగా రవాణా కు ఉపయోగిస్తున్న 2 మినీ వ్యాన్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..

IMG-20181006-WA0027రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, మంథని పోలీస్ స్టేషన్ల లో వీరిపై గతంలో కేసులు నమోదు చేయడం జరిగిందని, అయిన వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం, డబ్బుల కోసం మళ్ళీ నిషేధిత గుట్కా,తంబాక్ మహారాష్ట్ర, బీహార్ నుండి అక్రమ రవాణా గా ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహించి పట్టుకొవడం జరిగిందన్నారు..

IMG-20181006-WA0018

పోలీసులు తెలిపిన నిందితుల వివరాలలో..

మధురపు భిక్షపతి,
గట్ల రాజ్ కుమార్,
నక్క ప్రకాష్,
మాల్యాల సుదర్శన్,
సోనీ పవన్,
ఉత్తురి శ్రీకాంత్,
మట్టపర్తి సత్యనారాయణ, పెండం సదానందం, రవికాంత్,
బొల్లు శ్రీకాంత్,
చిదురాల శ్యామ్ సుందర్, చిదురాల నాగరాజు, కనకాల,
పడాల కొమురయ్య, రాచర్ల సత్యనారాయణ, వేల్పుల సంతోష్ లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.. ఇందులో చిదురాల నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.. ఇకముందు ఎవరైనా ప్రజల ఆరోగ్యాలకు ముప్పు కల్గించే గుట్కా, అంబార్ నిషేధిత అమ్మకాలు చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టుతామని హెచ్చరించారు..

IMG-20181006-WA0026
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ రవికుమార్, అడిషనల్ డిసిపి సంజీవ్, టాస్క్ పోర్స్ సిఐ సరిలాల్, సీసీఎస్ అధికారి శ్రీనివాస్, నాగరాజు, పోలీస్ కానిస్టేబుళ్లు సందిరి శ్రీనివాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిషేధిత గుట్కా అమ్మకాలు చేస్తున్న ముఠా ను చాకచక్యంగా పట్టుకొన్న పోలీసులను ఈ సందర్బంగా అభినందించారు..