నైట్ షెల్టర్ ప్రారంబించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

www.telaganareporter.news✍9394328296..

IMG_20190609_122022

నైట్ షెల్టర్ ప్రారంబించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, జాన్-9,తెలంగాణ రిపోర్టర్,(దినేష్):-

మిషన్ ఫర్ ఎలిమినేషన్ అఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్ ( మెప్మా) అధ్వర్యంలో జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ ( ఎన్. యు. ఎల్. ఎం.) లో భాగంగా మంజూరు కాబడిన నిధులు రూ. 45 లక్షల వ్యయంతో గోదావరిఖని బస్ స్టాండ్ వద్ద రామగుండం నగర పాలక సంస్థ నిర్మించిన నైట్ షెల్టర్ ను రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కొప్పుల ఈశ్వర్ ఆదివారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో బస పొందిన నిరాశ్రయులకు ప్లేట్ , గ్లాస్, దుప్పటి అందించారు.

IMG_20190609_123155
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమoలో పాల్గొన్న రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ..

IMG_20190609_122417 .నిరాశ్రయులకు ఈ షెల్టర్ బాసట గా నిలుస్తుందని అన్నారు. ఈ షెల్టర్ నిర్వహణకు సంవత్సరానికి రూ. 6.00 లక్షలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తాయని అన్నారు. మహిళా పట్టణ సమాఖ్య ఈ షెల్టర్ నిర్వహణా భాద్యతలు చూసుకుంటుందని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న వివిధ సంక్షేమ పథకాలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
రామగుండం నగర మేయర్ చిట్టూరి రాజమణి మట్లాడుతూ…

IMG_20190609_122723నైట్ షెల్టర్ నిరాశ్రయులకు అందుబాటులోకి రావడం హర్షనీయమని అన్నారు. రైల్వే స్టేషన్ వద్ద కూడా మరో నైట్ షెల్టర్ ప్రారంబోత్సవానికి సిద్దంగా వుందని అన్నారు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనూ మరొకటి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. నిరాశ్రయలు ఈ ఆశ్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

IMG_20190609_121900
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ , ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయా రెడ్డి , కార్పొరేటర్లు సాగంటి శంకర్, నారాయణ దాసు మారుతి , నస్రీన్ బేగం , బద్రి రజిత , జనగామ నర్సయ్య , షేక్ బాబు మియా, బొబ్బిలి సతీష్ కో ఆప్షన్ సబ్యులు చెరుకు బుచ్చి రెడ్డి మెప్మా డి.ఎం.సి. రజిత , కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఊర్మిళ , శ్వేత , తదితరులు పాల్గొన్నారు.