నైపుణ్యంతో కూడిన దర్యాప్తును నిర్వహించాలి -రాష్ట్ర డీ.జీ.పీ యం. మహేందర్‌ రెడ్డి

www.telaganareporter.news✍9394328296..
*నైపుణ్యంతో కూడిన దర్యాప్తును నిర్వహించాలి -రాష్ట్ర డీ.జీ.పీ యం. మహేందర్‌ రెడ్డి

IMG-20190612-WA0033

రామగుండం కమిషనరేట్,జూన్-13, తెలంగాణ రిపోర్టర్-(దినేష్)‘:- కేసుల పరిష్కరించడం కోసం అధికారులు నైపుణ్యమైన దర్యాప్తును నిర్వహించాలని రాష్ట్ర డీ.జీ.పీ పోలీస్‌ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలను పెంపోందించే దిశగా రాష్ట్ర డీ.జీ.పీ బుధవారం రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులతో హైదరాబాద్‌ డి.జీ.పీ కార్యాలయము నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు.

IMG-20190612-WA0031

రామగుండము పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తో పాటు మంచిర్యాల డిసిపి,పెద్దపల్లి డిసిపి తో పాటు ఎ.సి.పిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ స్టేషన్ల నందు నమోదయిన కేసుల దర్యాప్తులో అవలంబించాల్సిన పద్దతులతో పాటు, ప్యూహత్మకంతో కూడిన దర్యాప్తుపై రాష్ట్ర డీ.జీ.పీ పోలీస్‌ అధికారులతో ఈ సమావేశంలో చర్చించారు. మొదటగా ఈ సమావేశంలో నేరస్థులు పాల్పడిన నేరాలు కోర్టులో నిరూపించే విధంగా దర్యాప్తు అధికారులు దర్యాప్తులో విషయంలో అవలంభించాల్సిన అంశాలపై డీ.జీ.పీ అధికారుల వివరణ అడిగితేలుసుకున్నారు. అనంతరం నైపుణ్యంతో కూడిన దర్యాప్తును కోనసాగించేందుకుగా దర్యాప్తు అధికారులు పోలీస్‌ అధికారులకు ఎఫ్‌.ఐ.ఆర్‌ మొదలుకోని కోర్టులో ఛార్జ్ షీట్‌ అందజేసేవరకు పాటించాల్సిన అంశాలపై డీ.జీ.పీ ఈ వీడియో సమావేశం ద్వారా పలుసూచనలు చేసారు.
డీ.జీ.పీ  మాట్లాడుతూ…. కొన్ని కేసులు చాలా సంవత్సరాలుగా దర్యాప్తు స్థాయి లో ఉన్నాయి .నేరా నిరూపణ ,శిక్ష ఖరారు శాతం తక్కువగా ఉంది.కన్వేక్షన్ రేట్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. “నేరస్తులకు నేరం చేస్తే దొరికిపోతాము,దొరికితే తప్పకుండా శిక్ష పడుతుందనే భావన నేరస్తులలో కలిగినప్పుడే నేరాలు నిరోధించా బడుతాయి మరియు సమజంలో నేరాలు తగ్గుముఖం పడతాయి”. ప్రతి కేసు దర్యాప్తులోని ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ అనుసరించి దర్యాప్తులో ముందుకు కోనసాగాల్సిన అవసరం వుందని. ఫిర్యాదుదారుని స్వదస్తూరి మరియు వాడుక భాషలో వ్రాసి దరఖాస్తును స్వీకరించాలని, అధికారులు ప్రతి కేసులోను సత్వరమే నేరస్థలాన్ని సందర్శించి నేరస్థుడు మరియు భాధితుడి సంబంధించిన రుజువులను సేకరించడంలో సులభమవుతుందని. అన్ని నేరాల్లో ప్రభుత్వ అధికారులు పంచులుగా వినియోగించుకోవాలని. ప్రతి దర్యాప్తులోను సాక్షుల వాంగ్మూలన్ని దర్యాప్తు అధికారులు తప్పనిసరిగా తమ చేతిరాతతో వ్రాయలని, అధే విధంగా సాక్షి వాడుక భాషలోనే నమోదు చేయడం ద్వారా కోర్టుదృష్టిలో విశ్వసనీయత పెరుగుతుందని. అధే విధంగా దర్యాప్తులో భాగంగా పోలీస్‌ కస్టడీ, నేరస్తుని గుర్తింపు, చోరీ కేసుల్లో ఆస్తి గుర్తింపు పంచనామా, సాంకేతిక సాక్ష్యాల సేకరణ, పిటి వారెంట్‌, నేరస్థులకు బెయిల్‌ రాకుండా తీసుకోవల్సి చర్యలు, రిమాండ్‌ రిపోర్ట్‌, ఛార్జ్ షీట్‌, ఇంటరాగేషన్‌ రిపోర్ట్‌ మొదలైన అంశాల్లో దర్యాప్తు అధికారులు చేపట్టాల్సిన ప్రకియతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీ.జీ,పీ అధికారులకు ఈ సమావేశంలో దశదిశ నిర్థేశించారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి రక్షిత కే మూర్తి,పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్ ,గోదావరిఖని ఎసిపి ఉమేందర్ ,పెద్దపల్లి ఎసిపి వెంకటరమణ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు పాల్గోన్నారు.

–***********************************

తెలంగాణ రిపోర్టర్-(దినేష్)..✍