పంజాబ్ కు బదిలీ అయిన రామగుండం సిపి విక్రం జిత్ దుగ్గల్.

www.telaganareporter.news✍
9394328296.

IMG-20180809-WA0048

పంజాబ్ కు బదిలీ అయిన రామగుండం సిపి విక్రం జిత్ దుగ్గల్..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఆగస్టు-9, తెలంగాణ రిపోర్టర్(దినేష్):- పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన రామగుండం పోలీసు కమీషనర్ విక్రo జిత్ దుగ్గల్ పంజాబ్ రాష్ట్రంకు మూడేళ్ళ పాటు డిప్యూటేషన్ పై బదిలీ కి కేంద్రం ఆమోదo తెలిపింది..
రామగుండం పోలీస్ కమిషనర్ విక్రం జిత్ దుగ్గల్ వ్యక్తిగత అభ్యర్థన మేరకు డిప్యుటేషన్ పై పంజాబ్ కు మూడేళ్ళ పాటు బదిలీ చేస్తూ భారత ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీ కవిత పద్మనాభన్ ఉత్తర్వులు జారీ చేసారు..

IMG_20180809_204337
రామగుండం కమిషనరేట్ ప్రారంభం నాటి నుండి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో తమడైన శైలిలో విధులు నిర్వహించారు.. ఈ ప్రాoతంలో పోలీసులకు పలు సూచనలు ఇస్తూ, ప్రజల కోసం పోలీస్ ఉన్నారనే ధీమాను కల్పించి గొప్ప అధికారిగా పేరును సాదించుకొన్నారు..
అయితే సిపి దుగ్గల్ వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రాంతం నుండి బదిలీ కోసం ప్రయత్నిoచినట్లు సమాచారo.. ఈ మేరకు గురువారం భారత ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీ కవిత పద్మనాభన్ డిప్యుటేషన్ పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు...